ఆషాడభూతి
-----------------
ఈ నానుడి పంచతంత్ర కథ నుండి పుట్టింది. ఒక మోసగాడిని, వంచకుడిని గురించి చెప్పేటప్పుడు ఈ పేరును ప్రస్తావిస్తారు. "వీడా? వీడొక ఆషాడభూతి" అని ఎవరైనా అన్నారంటే వాడు నమ్మించి మోసం చేసేవాడు అని అర్ధం చేసుకోవొచ్చు. ఆ కథ ఏమిటో తెలుసుకుందాం. పంచతంత్రాలలో మిత్రభేదం ఒకటి. మిత్రభేదం కథలలో ఈ ఆషాడభూతి కథ ఉంది.
దేవశర్మ అనే ఒక సన్యాసి ఉండేవాడు. అతడు ఊరూరు తిరుగుతూ మంచి మంచి మాటలు చెబుతూ ఉండేవాడు. అతడికి ధనాపేక్ష ఎక్కువ. ప్రజలు ఇచ్చే వాటిని వద్దు వద్దు అంటూనే స్వీకరించేవాడు. ధనమంతా బొంతలో దాచుకునేవాడు. దాన్ని భద్రంగా చూసుకునేవాడు. ఇదంతా ఆషాడభూతి అనే మోసగాడు గమనించాడు. ఎలాగైనా ఆ బొంతను కాజేయాలనుకున్నాడు. అతడి వద్ద శిష్యుడిగా చేరాడు. మంచివాడు గా నటించాడు. కాళోత్తుతూ సేవలు చేశాడు. బాగా నమ్మకం కలిగించాడు. ఇలాంటి శిష్యుడు దొరకటం నా పూర్వ జన్మ అదృష్టం అనేంతగా నమ్మించాడు. పరులసొమ్ము పాము లాంటిదని, పరులది పూచికపుల్ల దొంగిలించిన అది మహాపాపమని, గురువుకే పాఠాలు చెప్పాడు. గురువు పూర్తిగా నమ్మాడు. ఎప్పుడూ ఎవరికి ఇవ్వకుండా తన వద్దే ఉంచుకునే ధనమున్న బొంతను శిష్యుడికి ఇచ్చాడు. నిశ్చింతగా ఉన్నాడు. గురువు చెరువులో స్నానం చేస్తున్న ఒకానొక సమయంలో ఆ బొంతను తీసుకొని ఉడాయించాడు. గురువు లబోదిబో మన్నాడు. ఆషాఢభూతి అంతు లేడు. పొంతూ లేడు. ఇదీ కథ.
నమ్మించి ద్రోహం చేసే వారిని గురించి చెప్పేటప్పుడు ఈ ' ఆషాడభూతి' అనే నానుడి తప్పగా ఉపయోగిస్తారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి