రక్షాబంధన్(బాల గేయం);- ఎడ్ల లక్ష్మి-సిద్దిపేట
అక్క తమ్ముల బంధం
చక్కనైన సంబంధం
అన్నా చెల్లెళ్ల బంధం
అనురాగాల సుగంధం

చుక్కల వెలుగు చూసి
రెక్కల గుర్రం ఎక్కాను
చక్కగా ఇంటికొచ్చాను
మక్కువతో చూశాను

పువ్వుల రాఖి తెచ్చాను
గువ్వలా ఎగురుతు రారా 
నుదటన తిలకం దిద్ది
రవ్వల హారం వేస్తాను

హారతి నీకు ఇస్తాను
చేతికి రాఖీ కట్టేసి
మల్లెలన్నీ చల్లేసి
చల్లని దీవెనలిస్తాను

రక్షాబంధన్ నీదిరా
రాఖీ కట్నం నాదిరా
రొక్కం నాకు వద్దురా
చల్లని ప్రేమ చాలురా


కామెంట్‌లు