గూడెం ;- కేశరాజు వేంకట ప్రభాకర్ రావు పాతర్లపాడు ఖమ్మం
పసుపు పచ్చని పూలను పూచి, ఆకు పచ్చని కాయలు కాచి !
పూరిగుడిసెకు అందంతెచ్చె, బీరతీగల దోరనవ్వులు !!
తేట తెల్లని పూలనుపూచి, లేతపచ్చని  బూరలు కాచి 
పందిరికెంతో శోభనుఇచ్చు, సోరతీగల తుంటరి వయసు !!

హలాల బట్టీ పొలాలు దున్ని, హాలాహలంబును  మింగైనా !
పచ్చని పైరు పసిడి పంటలు, పండించే బంగరు సీమలు !!
గొర్రెల మేకల తరగని సిరి ,ఆవుల గేదెల పాడి పొదుగులు !
ఊరి చెంతనె గిరుల సొగసులు ,ఫల పుష్పాలు పంచె దాతలు !!

పల్లె పక్కన వాగుల పరుగు ,పడతి చంకలొ బట్టల మూట!
నెత్తిన మట్టి కుండల మోత ,అయినా ఆగని నవ్వుల పూత !!
కష్టం సుఖం తెలియని లోకం ,కలిమి లేమి కావలి తీరం!
కల్ల కపటం తెలియని మేళం ,భవితకు  పొద్దు పొడిచె గూడెం !!

ప్రగతి రథాలను నడిపె పల్లె ,బతుకు బాటలు పరిచే పల్లె !
మాన వత్వమును పంచె పల్లె ,భాగ్య విధాత పల్లె సీమలు!!
పాల తెరకల కమ్మ దనం !పూదేనియల తీయదనం !!
పల్లె సీమలా మట్టి గుణం !అన్నం పెట్టే అమ్మ స్తన్యం !!




కామెంట్‌లు