రక్షాబంధనం ("రాజశ్రీ"కవితా ప్రక్రియలో)- *:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
1)
అన్నా చెల్లీ బంధమిది
సోదర ప్రేమకు అనుబంధమిది
శ్రావణ పూర్ణిమ నాడు
జరిపే పండుగ నేడు!
2)
అలనాడు రక్ష చేసే 
రాఖీ కట్టగ చూసే
కట్టిన రాఖీచూసెను రాజోత్తముడు
రక్ష చేయబడెను పురుషోత్తముడు!
3)
ఇప్పుడైన ఎప్పుడైన ఏమిత్రునికైనను
దయతలచి వదలాలి ఏశత్రువునైనను
కావాలి మనందరి విధానము
ఇదివీరులు శూరులకు ప్రధానము!
4)
భారతీయులు ఒకరికొకరు కట్టాలిరాఖీ
ఇంకెవరూ మిగలవద్దు బాకీ
మన భారతీయ సంప్రదాయమిది
మన భారతీయ సంస్కృతియిది!
5)
రాఖీఅంటే కాదుఉత్త దారాలపోగు
వెండిబంగారు వెలుగుజిలుగుల తూగు
రాఖీ అంటే ప్రాణరక్ష 
రాఖీ అంటే వచనభిక్ష!
********************************

కామెంట్‌లు