హరివిల్లు రచనలు - కాసుల ధీరాజ శర్మ, హైదరాబాద్,-9440522864.
 హరివిల్లు 311
🦚🦚🦚🦚
కునుకు తీయకుండ
తెలుగును కాపాడుదాం...!
చినుకు వణుకు పుట్టకుండ
తెలుగు భాషను నేర్పుదాం...!!
🦚🦚🦚🦚
హరివిల్లు 312
🦚🦚🦚🦚 
కనుసైగ ఆంతర్యాన్ని
నేను కనుగొంటిని........!
రెప్పపాటు భావాన్ని
బాధ్యతగ గైకొంటిని.....!!
 
🦚🦚🦚🦚
హరివిల్లు 313
🦚🦚🦚🦚
సబ్బుపైన తొలి "అ" కార
ఆకృతిని తెచ్చి పెట్టె.......!
సైకత శిల్పి వన్నెను 
తలపెట్టి కని పెట్టె....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 314
🦚🦚🦚🦚 
ఓహో ఏమి శుచి 
తినవలెను ఆఘ్రానించి....!
ఆహా ఏమి రుచి 
అనవలెను ఆస్వాదించి....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 315
🦚🦚🦚🦚 
శబ్దమున నిశ్శబ్దము
ఇసుమంత ఇముడబడదు..!
సత్యాసత్యములయందు
పొంతన మాటే కుదరదు....!!
                (ఇంకా ఉన్నాయి

కామెంట్‌లు