వైతాళికుడు ! అక్షర యాత్రికుడు!;- డా పివిఎల్ సుబ్బారావు.విజయనగరం.94410 58797.
వెలుగుజాడ - గురజాడ జయంతి శుభాకాంక్షలతో
===================================
1. కద,కవిత ,నాటకం,
    త్రివేణి సంగమం ఆ కలం! 

  సమాజ సంస్కరణ ,
  ఆయన సాహిత్య బలం! 

ప్రభువుల కొలువులో ఉన్నా ,
ఆయన ప్రజల పక్షం !

తోకచుక్క, కేతనమన్న,    
        శాస్త్రీయ దృక్పథం!

 వాడుక భాష ,
ఆయన అక్షర ఆయుధం!

2. తొలికథ దిద్దుబాటు ,
     జీవన సరి సర్దుబాటు !

 పెద్ద మసీదు, మతం పై,  
     వ్రాసిచ్చిన  పెద్దరసీదు! 

మీ పేరేమిటి ,
    హేతువాద పరిశీలనం !

సంస్కర్త హృదయం,
 ఆశయ ,ఆచరణాల భేదం !  

వారి కథల బలం,
    అద్భుతమైన కథనం!

3.*పుత్తడి బొమ్మ పూర్ణమ్మ,*
    కదిలించే, కరిగించే కొమ్మ !  

 కన్యక,
  నారీ శక్తికి ,ఏనాటికి ఓ ప్రతీక! 

కాసులు , స్త్రీ పురుషుల ,
మధ్య మోహం దాటిన ప్రేమ !

పెంచక,పెరుగునే ప్రేమ?
           ప్రేమ ని పెంచాలి!

 మరులు మరలిపోవును ,
     ప్రేమ నిలిచిపోవును!

4.ఆయన దేశభక్తి, 
  ప్రతి అక్షరం. కవితాణుశక్తి!

 అన్య దేశభక్తి గీతాలు ,
       దేశ యశో స్త్రోత్రాలు ,

ఆయన అందించారు,    
    అభ్యుదయ సూత్రాలు !

దేశాన్ని ప్రేమించడం అంటే ,
          ఆ మట్టిని కాదు !

దేశంలోని మనుషులను, ప్రేమించాలని నినదించారు!

5.*కన్యాశుల్కం* నాటక, ప్రపంచానమకుటమైనిలిచింది!

శాసనం చేయలేనిపని,
సాహిత్యం చేస్తుందని చెప్పింది!

ముత్యాలసరమై తెలుగు, సరస్వతి కంఠాన నిలిచాడు! 

సాహిత్యాంతం నాటకం,
 ధ్రువం, నిజం చేసాడు !

ప్రజల కోసం ఉద్యమ ,
చెరగని జాడ మన గురజాడ!
_______________________


కామెంట్‌లు