జీవన సార్ధకత.;- డా.పి.వి.ఎల్. సుబ్బారావు, 9441058797..
34.
    నీకు నేడు బహుముఖాలు,
            ఉన్నాయి సంతోషం!   

    అందులో మనిషి ముఖం ,
          ఉందా, చూసుకో !

   మనిషి ముఖం లేనప్పుడు,
    ఎన్ని ముఖాలు ఉంటేనేం?    

    పుట్టడం ,గిట్టడం,
        జీవుల సహజ లక్షణం! 

   మధ్యలో ఎలా ఉన్నావు?
         అది జన వీక్షణం!
35.
 నీ మెదడుకు" ఆలోచించే",
                    శక్తి ఉంది !

దేహానికి ఆలోచన ఆచరణగా, మార్చే సామర్థ్యముంది! 

"మానవత్వం" గురించి అసలు,
                ఆలోచిస్తున్నావా?

 రవ్వంతైనా ఆచరణలో,
     పెట్టాలనుకుంటున్నావా? 

"గుండె" మానవత్వం నిండాలి,
      లేకుంటే "బండే"నయం!

36.
    రోజు రోజుకి మొండిగా,    
             మారిపోతున్నావు!

    అదేమిటో శిఖండిగా,
     పగతో బతుకుతున్నావు! 

   మూరమల్లెచెండు, నలుమూలలా పరిమళిస్తోంది!

 తేనెటీగ తేనె ,
కూడ పెట్టాలని, పరితపిస్తోంది!

 నీవెందుకు ,
వింత మృగమై సంచరిస్తావు?
_______________________
రేపు కొనసాగుతుంది.


కామెంట్‌లు