16.
ధన సంపాదన,
తృష్ణ కాకూడనిది !
తృష్ణతో జీవితం,
మృగతృష్ణే!
నిత్య తృప్తి మనిషి,
పరమావధి !
అది సాధిస్తే జీవనం,
ఇల మోక్షం !
కాకుంటే నరలోకం,
నరక లోకమే!
14.
ప్రేమ జగాన,
మానవత్వ మూలతత్వం!
మానవత పునీతమయ్యే,
మహా మంత్రం!
ఆ మంత్రసాధన,
ఒసగు మహాసత్వం!
ఆ మహాసత్వం,
బోధ చేయు మహాసత్యం!
సత్యమొక్కటే ,
మానవ జీవన సారం!
18.
ప్రేమ అనిర్వచనీయం,
అనుభూతి. యజ్జం!
ప్రసాదించు జీవనసౌందర్యం,
మానవసౌభాగ్యం!
అవని ఆనంద మార్గం,
స్వర్గానికి తెరిచే ద్వారం!
సరి ఆకర్షణ మగ్గం,
నిజ సమర్పణ లగ్నం!
నిజ సమర్పణే మనకు,
విముక్తి కారణం!
______________________
రేపు కొనసాగుతుంది.
జీవన సార్ధకత. ;- డా.పి.వి.ఎల్.సుబ్బారావు.944105879.7
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి