పూర్వ జన్మ;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9482811322.
 ఏ బిడ్డ ఈ భూమి మీదకు వచ్చినా తాను పెరికి పెద్దవాడై  విద్యాబుద్ధులు నేర్చుకుంటాడు  జీవితంలో స్థిరపడడం కోసం  ఉద్యోగం చేయాలి లేదా  కాయ కష్టం చేయాలి  అదీ లేకపోతే వ్యాపారం చేయాలి  దానికి తగిన ధనం ఉండాలి  ఇవేమీ చేయలేని వ్యక్తి  ఎందుకూ పనికిరాని వాడుగా పరిగణించబడతాడు  దానిని తట్టుకోలేక తల్లిదండ్రులు  బిడ్డకు కావలసిన వనరులు అన్నిటినీ ఏర్పాటు చేస్తారు.  అతను వయసులోకి వచ్చిన తర్వాత  ఎవరైనా అందమైన ఆడపిల్లను చూసినట్లయితే  ఆమెను వివాహం చేసుకుంటే బాగుంటుంది  నా జీవితం సుఖ ప్రదమవుతుంది  ఎలాంటి బాధలకు  లోను కాకుండా  ఆనందమయ జీవితాన్ని గడపాలి అనుకుంటాడు. దానికి తగినట్లుగా  తమ పెద్దవారు చెప్పిన కొన్ని మాటలు  అతని మనసులో ఉండిపోతాయి  పూర్వ జన్మలో మనం చేసిన  పాపాలనన్నిటిని కడిగి వేయడానికి  స్త్రీ అవసరమవుతుంది ఆమె ద్వారా  సంచిత జన్మలో జరిగిన  కర్మలకు ప్రాయశ్చిత్తం  చేసుకోవాలని ముచ్చట పెడతారు  అలాగే వివాహం జరుగుతుంది  పున్నామ నరకం నుంచి రక్షించే కుమారుడు ఉద్భవిస్తాడు  మరొక ఆడపిల్ల కూడా ఆ కుటుంబంలో సభ్యురాలిగా చేరుతుంది  తన జీవితం ఎంతో సుఖంగా నడుస్తుంది అని భ్రమలకు లోనై  తన జీవితాన్ని నడుపుతూ ఉంటాడు  ఏ కుటుంబం కూడా సజావుగా నడవదు  ఎన్నో కష్టనష్టాలు  వస్తూ ఉంటాయి  వాటిని భరిస్తూ ఉండాలి  ఆ సమయంలో అతనికి జీవితం మీద విరక్తి కూడా కలుగుతుంది. దీనికి వేమన చక్కటి  ఉపమానాన్ని చెప్తున్నాడు  వేమన ఏ పోలిక చెప్పినా దానికి అతికినట్లుగా  సరిపోతుంది  పూర్వ జన్మలో అతను చేసిన పాపపు పనులు ఏమిటో ఈ కుర్రవాడికి తెలుసునా  ఆ పాపాలను పరిహరించడానికి  ఈ కొత్త వ్యక్తి భార్య పేరుతో వచ్చినావిడ ఏం చేయగలదు  ఆ పాపాల నుంచి దూరం చేయగలిగిన సత్తా ఆమెకు ఉన్నదా అని ప్రశ్నిస్తున్నాడు  కర్మ ఫలాన్ని తీసివేయడానికి ఆమె ఎవరు  భగవతిగా  నీ ముందుకు వచ్చిందా  నీవు చేసిన పాపాలన్నీ ఆమెకు తెలుసునా  అని ప్రశ్నిస్తూ  మానవుడు ఎన్ని రకాల పనులు చేసిన  కర్మఫలం అనుభవించే తీరాలి  అది  ఏదో శక్తి వల్ల కానీ నీ భార్య వల్ల కానీ  కాని పని అని తెలుసుకో  అని హితవు చెబుతూ రాసిన పద్యం చదవండి.

"సతుల జూచి నరుడు సౌఖ్యంబు గోరును గతులు గాన లేడు కర్మమందు గతులు నతలు వలన గానంగా లేరయా..."


కామెంట్‌లు