న్యాయాలు -265
వృక్ష ప్రవృత్తి న్యాయము
***************
వృక్షము అంటే చెట్టు,తరువు,భూరుహము మొదలైన అర్థాలు ఉన్నాయి.ప్రవృత్తి అంటే గుర్తించబడిన స్థిరమైన స్వభావము లేదా నైజము.
చెట్టు తనంతట తానే ఎదుగుతూ విస్తరిస్తుంది. ఇందులో ఎవరి ప్రయత్నము కానీ తోడ్పాటు కానీ వుండదు.తనంత తానుగా బాగా పెరిగి విస్తరిస్తుంది. అది చెట్టు యొక్క గుర్తించబడిన స్థిరమైన స్వభావము.
చెట్టు తనంతట తానుగా ఎవరి ప్రమేయం లేకుండా ఎదగడం అందరికీ తెలిసిందే. జగమెరిగిన సత్యమే. మరి దీనిని న్యాయంగా చెప్పవలసిన అవసరం ఏమున్నది? అని సాధారణ భావార్థంతో చూస్తే అనిపిస్తుంది. కానీ తరచి చూస్తే ఇందులో ఎంతో నిగూఢమైన అర్థం దాగి ఉంది.
మనల్ని మనం ఓ విత్తనంగా భావించుకున్నట్లయితే మనలోని నిక్షిప్తమైన చైతన్య శక్తి సమయం వచ్చినప్పుడు మొలకెత్తే మొక్క అవ్వాలి.
ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా రాతి నెర్రెలను సైతం చీల్చుకుని బయటకు వచ్చే మొక్కలా తన ఉనికిని చాటుకోవాలి.
అంత వరకే పరిమితం అయితే ఈ న్యాయ ప్రసక్తే లేదు. తన జీవితాన్ని శాఖోపశాఖలుగా విస్తరింపజేసుకోవాలి. విస్తరించిన తనువుతో ఎవరికి లాభం?
అందుకే ఆ విస్తరణ అనేది నలుగురికి నీడ నివ్వాలి.పదుగురి పండ్ల నివ్వాలి. జగతిలోని సహ జీవులు బతికేందుకు ప్రాణ వాయువు సైతం ఇవ్వాలి అంటే పరోపకారం చేయాలి.అప్పుడే తరువులా జీవితం సార్థకం అవుతుంది.
ఇలా సార్థకం చేసుకోవడం అంత తేలికైన విషయం కాదు.
చెట్టు ఎదిగే క్రమంలో మొక్కగా ఉన్నప్పుడు పశుపక్ష్యాదుల బారిన పడకుండా ఉండాలి.
శిశిరపు దాడిలో నిలువునా ఆకులు రాలి మోడై పోయినా భవిష్యత్తుపై అంతులేని నమ్మకం కలిగి వుండాలి.అప్పుడే వసంతం వచ్చి తనువులోని అణువణువులో ఆనందాల చిగుళ్ళు వేయిస్తుంది.
అంటే ఇక్కడ మనిషి ఆశయం కోసం బతికేటప్పుడు ఇలాంటి వెన్నో ఎదుర్కోవాల్సి వస్తుందనేది గమనంలో పెట్టుకొని జీవితాన్ని చెట్టులా నిత్య నూతన చైతన్యంతో సాగించాలి.
అలా తనను తాను తెలుసుకోగలిగి, తనను తాను మలచుకొని, ఉనికిలో వృక్షమై, ఎందరికో ఆదర్శమై సమాజంలో తనదైన అస్థిత్వాన్ని చాటుకుంటూ బతకడమే జీవితం.
వృక్షము ఎంత గొప్పదో ఈ పద్యాన్ని చూద్దామా...
"బ్రతికినన్నాళ్ళు ఫలములిచ్చుటె గాదు/చచ్చి కూడ చీల్చి ఇచ్చు తనువు/ త్యాగభావమునకు తరువులే గురువులు/ లలిత సుగుణ జాల! తెలుగు బాల!"
చెట్లు బతికినంత కాలం మనకు పండ్లను ఇస్తాయి. చచ్చిపోయిన తరువాత కూడా వాటి కలప మనకు ఉపయోగపడుతుంది. త్యాగానికి అసలైన ప్రతీకలు చెట్లే. అలాంటి త్యాగ గుణమును మనకు నేర్పుతున్నందున చెట్లు గురువులుగా గౌరవాన్ని పొందుతున్నాయి.
ఇదే "వృక్ష ప్రవృత్తి న్యాయం" ఇచ్చే అమూల్యమైన సందేశం. ఇది సర్వకాలాలలో ఆమోదయోగ్యం, ఆచరణీయం.
ప్రభాత కిరణాల నమస్సులతో🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి