శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ

 రాష్ట్ర కూటులు..రాఠౌడ్ వంశం కనౌజ్ మూలవాసులు.1211లో రావు సియాజీ జోధ్పూర్ రాజ్యానికి పునాది వేశాడు.మార్వాడ్ లోకి కూడా ప్రవేశించారు.జోధ్పూర్ రాఠౌడ్ వంశం చాలా ప్రాచీనమైనది.వీరి గూర్చి ఎన్నో కథనాలు ఉన్నాయి.ఇంద్రుని రహట్(వెన్నెముక) నించి పుట్టారుకాబట్టి రాఠౌర్ అన్నారు.వీరి కులదేవత రాష్ట్ర శ్యైనా రాఠాణీ రాఠేశ్వరి.ఆమె పేరు మీదుగా రాష్ట్ర కూట వచ్చింది.సీథియన్ తెగ అని 100కి పైగా శాఖలు న్నాయని చరిత్ర కారుల అభిప్రాయం.జోధా చాంపవత్ ఉదావత్ కూంపావత్ మియోత్ మెడతియా కర్నోత్ కరంశోత్ కాంటావత్ రూపావత్ ప్రసిద్ధి.
ఎల్లోరా లోని కైలాస గుహ ను రాష్ట్ర కూట రాజు 3వకృష్ణరాజు నిర్మించాడు.ఈకులం ఉత్పత్తి యదు వల్ల జరిగింది అని వారి పూర్వీకులనామం రట్ట్ అని రాష్ట్ర కూట్ అనే రాజు వల్ల ఆవంశానికి ఆపేరు వచ్చింది. రాముని కొడుకు కుశుని వంశం అని అంటారు.యాదవవంశ రాష్ట్ర కూటులసంబంధంఆంధ్ర ద్రవిడరెడ్డి కులంతో ఉందని చరిత్రకారుల అభిప్రాయం.రఠీ మహారాఠీలు మహారాష్ట్ర కర్ణాటక సామంతులు.దంతివర్మన్ ప్రముఖుడు.కానడీ కన్నడ (ఒకటే) మహారాష్ట్ర లతో రాఠౌర్ వంశంకి సంబంధబాంధవ్యాలు ఉన్నాయి 🌹
కామెంట్‌లు