శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ

 యాగ్నిక్  అనేపదం యజుర్వేదం లోధార్మిక కర్మకాండల విస్తృత వివేచన లో వస్తుంది.వైదిక ధర్మం లోయగ్నాలకి ప్రాధాన్యత ఉంది.ఋగ్వేదకాలంలో యజన పూజ ఉపాసన అనే సామాన్య అర్థం లో వాడారు.తర్వాత అగ్ని లో ఆహుతి తో పాటు అనేక రకాల క్రియలతో కూడిన అనుష్ఠానం ని యగ్నం అన్నారు.మన బ్రాహ్మణ గ్రంధాలు యగ్నక్రియల్తో ఉన్నాయి.ప్రాచీనకాలంలో అశ్వమేధ రాజసూయ పురుషమేధ వాజపేయి దర్శపూర్ణమాస్ అగ్నిష్టోమ అనే రకరకాలుగా యగ్నాలుండేవి.పాకయగ్నం హవిర్యగ్నం సోమయగ్నం అని మూడు రకాలు ఉండేవి.
తామ్రపత్రాల్లో యాగ్నిక్ ఉపనామంగా ఉంది.తమ ఇంట్లో వాళ్లు యగ్నం చేసేవారు కాదు కానీ ఇతరుల ఇళ్ళల్లో చేసేవారు.యోగ నిద్ర అనేది యోగసాధన లో జాగరణ నిద్ర లమధ్య ఉన్న స్థితి.శరీర అవయవాల పై ధ్యానము ఉంచి యోగి శరీరం నిద్రలోకి జారుతుంది.కానీ జీవాత్మ సతర్కంతో జాగ్రదావస్థలోనే ఉంటుంది.మానసిక కష్టాలు మనస్థాపాలు శాంతిస్తాయి.మానసిక ఆధ్యాత్మిక లాభంకల్గుతుంది.శ్రీమహావిష్ణువు నిద్ర నికూడా యోగనిద్ర అనే అంటారు.యుగాంతంలోనిద్ర .సత్వ రజో తమో గుణాలు జీవులకర్మ జీవాత్మ అన్ని ప్రళయంలో విలీనం ఔతాయి.ఆసమయమే యోగనిద్ర అన్నారు🌹
కామెంట్‌లు