సుప్రభాత కవిత ; - బృంద
నింగీ నేలా కలిసే చోట
నీలం ఎరుపుగ మారే పూట
తూరుపు వాకిట గగనపు బాట
లోకపు చీకటి తరిమే వెలుగు పువ్వట!

పొన్నపూల రంగుతో
పొడిచేనంట
పొద్దెక్కు వేళ పగడపు
ఎరుపుగా మారేనంట!

నింగిలో మారుతున్న
రంగులు చూసి
పువ్వులన్నీ పకపకా
నవ్వులుగా విరిసేనట!

పచ్చని పైటేసి పుడమితల్లి
కిరణాలు తాకినంత
మరకతమణి వోలె
మెరిసి మురిసి పోయేనంట!

రంగు రంగుల సుమశ్రేణి
అవనికి  అపురూప అందాల 
ఆభరణములుగా అలరించి
ఆనంద లహరిలో తేలించెనట!

రమణియ సోయగపు
కమనీయ దృశ్యము 
కన్నులకు విందుగా
మురిపింప మనసు పాడె

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు