నా పైత్యం- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
ఒక దీపము వెలిగింది
ఓ దృశ్యము కనపడింది

ఒక అందము ఆకర్షించింది
ఓ ఆనందము కలిగించింది

ఒక మోము తళతళామెరిసింది
ఓ నవ్వు పకపకాలాడించింది

ఒక చూపు సూటిగాతగిలింది
ఓ కైపు మేనునావరించింది

ఒక మాట వినిపించింది
ఓ మారు కులుకించింది

ఒక ఊహ మదినితట్టింది
ఓ భావన బయటకొచ్చింది

ఒక స్నేహము కుదిరింది
ఓ కార్యము నెరవేరింది

ఒక తోడు దొరికింది
ఓ జోడు లభించింది

ఒక పైత్యము తలకెక్కింది
ఓ కవిత్వము వెలువడింది

ఒక నిమిషం వీలయితేచదవండి
ఓ అభిప్రాయం నచ్చితేతెలుపండి


కామెంట్‌లు