డ్రైఐస్ అంటే ఏంటి?- ఎస్. మౌనిక

  హాయ్!..హలో మై డియర్ ఫ్రెండ్స్....
 ఎలా ఉన్నారు? నేనైతే ఫుల్ హ్యాపీ...... మరి మీరు? ఇంకో కొత్త విలువైన విషయం తో మీ నేస్తం మీ ముందుకు వచ్చేసిందిగా!.... సాధారణంగా మంచు అంటే మనకి రెండు రకాల మంచులు గుర్తుకొస్తాయి. నీటిని గడ్డకట్టించి బజారులో అమ్మేది ఒక రకమైతే...... చలికాలంలో పర్వతాల మీద కురిసేది మరొకటి. ఈ రెండు నీరు గనిభవిస్తే ఏర్పడతాయి. అయితే మూడో రకం మంచు కూడా ఉంది.దీనిని ఎండు మంచు (dry ice) అంటారు. మామూలు మంచు లాగా ఇది నీటి నుండి తయారవ్వదు. కార్బన్ డయాక్సైడ్ నుండి తయారవుతుంది. ఎండు మంచును గనిభవించిన కార్బన్డయాక్సైడ్ అని కూడా అంటారు. మామూలుగా అయితే కార్బన్డయాక్సైడ్ ఒక వాయువు.తక్కువ ఉష్ణోగ్రతలో దీనిపై ఒత్తిడి అధికం చేస్తే ఇది గడ్డ కడుతుంది.ఇలా గడ్డకట్టిన కార్బన్డయాక్సైడే ఎండ మంచు.చాలా చల్లగా ఉంటుంది. ఈ మంచు ప్రత్యేకత ఏమిటంటే దీన్ని కరిగించితే ద్రవంగా మారకుండా తిన్నగా వాయు రూపంలోకి వెళ్ళిపోతుంది.ఇది చాలా బరువుగా కూడా ఉంటుంది. దీన్ని చేతితో పట్టుకుంటే తడి కాదు. ఈ మంచు వలన ఎంతో ఉపయోగం ఉంది. పరిశోధనలలో శాస్త్రవేత్తలు దీనిలోని ఉష్ణోగ్రతను తగ్గిస్తారు. మాంసము,ఐస్క్రీంలను ఓడలను దూర ప్రాంతాలకు రవాణా చేసేందుకు దీనిని వాడతారు.దీని వలన దూర ప్రయాణంలో ఇవి పాడవకుండా ఉంటాయి. కొంచెం కొత్తగా ఉంది కదా ఫ్రెండ్స్.... ఇటువంటి ఎన్నో విషయాలను మీరు తెలుసుకోవాలని అనుకుంటున్నారా?అయితే టచ్ లో ఉండండి మొలకతో...!మీ నేస్తం ఎల్లప్పుడూ రెడీగా ఉంటుంది.....మనం మళ్లీ ఇంకో కొత్త విషయంలో త్వరలోనే కలుద్దామా... ఫ్రెండ్స్!బాయ్... 👋 ఉండనా మరి...!
కామెంట్‌లు