తెలుగు దోహాలు - ఎం. వి. ఉమాదేవి.

 5)
వెన్నెల వానల తీరులో కవికి కలం తోడుంది
కన్నుల నీటిని ఆపుతూ భావ విరుల పూతుంది !
6)
కోయిల వాలిన మావికే, రెమ్మ చిగురు వేసెనుగ
తోటకి వేసిన కంచెయే, తరువు పాట పాడెనుగ !
7)
ఏమిటి మాయగ ఉన్నదీ, ఎదను మీటు కలవరము
వలపే ఇదనీ తెలియదే, రాధ కందె నొకవరము !
8)
మొగులే మోసం చేసినా, రైతు బాధ తీరదిల
పగలే చుక్కలు పొడు చునా, పంట వచ్చె ఇంటనెల!
9)
ప్రతిభావంతుల వేటలో, పాఠశాల అధిపతులు
మతిపోతుందిక బాలలూ, వత్తిడైనవి చదువులు !
10)
రాముని పాలన కోరగా మానవత్వమేదిచట
భీముని బలమే కూడినా ఓటమొకటి తప్పదట!
కామెంట్‌లు