నైతిక విలువలు - సి.హెచ్.ప్రతాప్
 నైతిక విలువలు అనేవి మంచి అలవాట్లతో కూడిన వ్యవస్థ. ఇది సంతోషకరమైన జీవితాన్ని పొందటానికి మానవుల  ప్రవర్తనను రూపొందిస్తాయి. నైతికతతో, మానవాళి నిజాయితీగా, ఆదర్శప్రాయంగా జీవించే వెసులుబాటు కలుగుతుంది. ఇది చుట్టూ ఉన్నవారితో నమ్మకం మరియు స్నేహాన్ని బలపరుస్తుంది. సంతోషానికి నైతిక విలువలే కీలకం అని మనో వైజ్ఞానికులు సైతం చెబుతున్నారు.నైతికత పెంపొందించేందుకు మానవాళి కొన్ని నియమ నిబంధనలను రూపొందించుకొని అందుకు అనుగుణంగా జీవనం సాగించాలి. ఉదాహరణకు :
- జీవులను చంపడం మానుకోవాలి.
- ఇవ్వని వాటిని తీసుకోకుండా ఉండాలి.
- అనుచిత లైంగిక ప్రవర్తనకు దూరంగా ఉండాలి.
- అబద్ధాలు చెప్పడం మానుకోవాలి.
- మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి
- తల్లిదండ్రులను, మన కంటే వయస్సులో పెద్దవారిని, గురువులను గౌరవించాలి.
- సాటి వారికి మనకు వీలైనంత సహాయ సహకారాలు అందించాలి.
విద్యార్థులే భారతదేశ భవిష్యత్తు అని, వారి విద్యార్థి జీవితంలో వారికి అందించిన విలువలపై మన దేశ భవిష్యత్తు చాలా ఆధారపడి ఉంటుంది. నైతిక విలువలు జీవితంలో వారి అన్ని నిర్ణయాలకు మార్గం సుగమం చేస్తాయి, ఈ విలువలు లేకుండా, పిల్లలకు ఎటువంటి మార్గదర్శకత్వం ఉండదు మరియు వారి జీవితం దిక్కులేనిదిగా అనిపించవచ్చు. సమాజం ఆమోదించడానికి మరియు గౌరవించబడటానికి, తల్లిదండ్రులు మరియు సంరక్షకులు ఈ బలమైన నైతిక విలువలను పిల్లలలో ఒక జీవనశైలి వలె నింపేలా చూసుకోవాలి. 

కామెంట్‌లు