గోవిందుడు;- టి. వి. యెల్. గాయత్రి- పూణే. మహారాష్ట్ర.
మత్తేభ విక్రీడితములు //

గురుతుల్ చెప్పెద !కొంటె బాలుడతడే!గోవింద నామంబుతో
తరువుల్ దూకుచు
నాడుచుండు!కనరో!దైవాంశ సంభూతుడే
వర పుత్రుండు యశోదకున్ గలిగి
తావర్ధిల్లె రేపల్లెలో
మురిపెంబారగ పెంచుకుందురతనిన్ ముద్దార గోపాలకుల్ //


పరమంబైన రహస్యమున్ దెలిపెదన్ బాలుండు కాదీతడే
చిఱు ప్రాయంబున పెక్కు లీలలిట నచ్చెర్వొందగా సల్పితా
చరియించెన్ ధర
నుద్ధరించ తనదౌ సామర్ధ్యమే చూపుచున్
బరమాత్ముండిదె వచ్చె నిక్కమిదియే ప్రార్థించ మోక్షంబిడున్ //


హరియే విశ్వమయుండటంచు మదియందామూర్తినే నిల్పుచున్
నిరతంబాతని నామమున్ బలుకుచున్ నిర్మోహులై యోగులున్
మరుజన్మంబుల నొందఁరీ విధిని సన్మార్గంబునన్ బోవగన్
శరణంబంటిని విష్ణువున్ గొలుచుచున్ సద్బుద్దితో మెల్గుచున్ //


కామెంట్‌లు