పండుగ ప్రాధాన్యం;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 భారతీయుల  పండుగలలో ప్రతిదానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది  ఆధ్యాత్మిక స్థితిని తెలియజేస్తూ చెప్పే పండుగల పరమార్థం  వేద విహితమైనది  వేదంలో ప్రతి పండుగ పూర్వాపరాలను విశదీకరిస్తూ  దాని విశేషాలను ఆ పండుగ చేయడం వల్ల వచ్చే ఫలితాలను తెలియజేయడం జరుగుతూ ఉంటుంది  ప్రతి ఇంట్లోనూ ఉదయం   శాస్త్రీయంగా పూజ జరపడం  ప్రతి ఒక్కరూ భక్తి భావంతో భగవంతునికి మోకరిల్లి  పూజ చేయడం అలవాయితీ  కుటుంబ సభ్యులు అందరూ కలిసి కూర్చుని  గణేశ్వరుని పూజ చేయడం పరిపాటి  ప్రతి పండుగకు ఒక శాస్త్రీయమైన  అర్థం పరమార్థం ఉంటుందని మన వాళ్ళు చెప్తారు  వినాయకుని ఆకారం మనం ఈ భూలోకంలో ఎక్కడా చూడం  ప్రత్యేకతను సంతరించుకున్న ఆకారం.
భూమిని పార్వతి దేవితో పోల్చి భూమాతగా ఎలా పూజలు అందిస్తామో ఆకాశంలో ఉన్న శివునికి  ఎలాంటి పూజలు చేస్తామో  భూమిని ఆకాశాన్ని కలిపిన వినాయక స్వామిని అలా పూజిస్తాం భౌతికంగా ప్రతి అణువుకు వారు అధిష్టాన దేవత పూజ చేసేటప్పుడు వినాయకునికి అర్పించే ప్రతి వస్తువు  మన ఆరోగ్యాన్ని పరిరక్షించేదే  ఎన్ని రకాల  ఆకులను పువ్వులను  తెస్తాం  ఆ పచ్చదనం ప్రాముఖ్యత ఏది ఈ సమయంలోనే  ఏ ఆకు పేరు ఏమిటో దాని లక్షణం ఏమిటో అది ఎందుకు ఉపయోగపడుతుందో బాలలకు సైతం తెలియజేయడానికి ఆ ప్రయత్నం. నెయ్యి నూనెతో చేసే ఏ పదార్థం అయినా  కొవ్వును పెంచుతుంది  ఆవిరితో చేసే కుడుములు కానీ ఉండ్రాళ్ళు కానీ  అలాంటి చెడు ఫలితాన్ని ఇవ్వవు  అందుకూ వాటిని వాడడం
తల్లిదండ్రులను పూజించాలి అన్న విషయాన్ని తెలియజేయడానికి  భౌతిక బలం కన్నా బుద్ధి బలం గొప్పతనం చెప్పడానికి  ఆకుపచ్చని ఆహారం తింటే తెలివితేటలు ఎలా పెరుగుతాయో తెలియజేయడానికి  21 రకాల పత్రితో పూజ చేయడం వల్ల  ప్రకృతి స్థితి పిల్లలకు తెలియజేయడం  మనలో సామర్థ్యం ఉండాలి కానీ  పరికరాలు ప్రధానం కాదు అని తెలియజేయడానికి  అతి చిన్న  జంతువైన ఎలుకను వాహనంగా వారికి ఏర్పాటు చేయడం  అష్టదిక్పాలకులుగా ఉన్న ప్రతి ఒక్కరితో  నమస్కారాలు పెట్టించుకున్న  గణపతికి ప్రత్యేకంగా తన తండ్రి కూడా నమస్కరించడం  అంటే మేధస్సుకు  మనం ఇవ్వవలసిన గౌరవం, భక్తి ప్రపత్తులు ఎలా ఉండాలో చెప్పడం ఈ పండుగ ముఖ్య ఉద్దేశమై ఉంటుంది.కామెంట్‌లు