వింత పోకడలు ;- మదనంబేడు వెంకట సత్యప్రసాద్ -9398155633

 
ఫోన్ మోగుతుంటే ఫోన్ వైపు చూసింది జయ  . " హబ్బా , అమ్మ ! సరిగ్గా టైం చూసుకుని చేస్తుంది కదా ! " అనుకుంటూ ఫోన్ తీసింది జయ . ఏదో చెప్పబోయింది జయ  తల్లి రజని , " కాస్త చెప్పేది వినవే ! " అన్నట్టు.
" అమ్మా ! నేను సాయంత్రం నీతో తీరిగ్గా మాటాడుతా ఇపుడు ఫోన్ పేట్టీయ్ " అంది  జయ  హడావిడిగా.  జయ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ లో ఉద్యోగం చేస్తోంది.  చిన్న వయసులోనే ఉద్యోగం రావడం, సంపాదన కూడా బాగా ఉండటం వలన కాస్త స్వాతంత్ర్య భావాలు  కలిగి , అన్ని విషయాల లోను సొంత నిర్ణయాలు తీసుకుంటుంది. 
జయ తల్లి రజని , చదివింది పదవ తరగతి వరకే అయినా లోక జ్ఞ్యానం ఎక్కువ. జయ తండ్రి మోహన్ స్కూల్ టీచర్ గా పనిచేస్తున్నాడు. ఎదుగూ బొదుగూ లేకపోయినా, గవర్నమెంట్ ఉద్యోగం కాబట్టి రోజులు వెళ్లబుచ్చుతున్నాడు. వీళ్ళకి   జయ ఒక్కతే కూతురు. ఇంక పిల్లలు పుట్టలేదు. జయ ఒక్కగానొక్క బిడ్డ కాబట్టి , ఎంతో గారాబంగా పెంచారు.  వీళ్ళ ఆశలకు తగినట్లుగానే జయ కూడా బాగా చదువుకుంది. అన్ని క్లాసుల్లోను మంచి మార్కులతోనే పాస్ అయ్యింది.  
కాంపస్ సెలెక్షన్స్ లోనే సెలెక్ట్ అవడం,  హైద్రాబాద్ లోనే ఉద్యోగం రావడం వలన ,  వీళ్ళు ఉండే కరీంనగర్ కు హైదరాబాద్ పెద్ద దూరం కాదు కాబట్టి   ఏ మాత్రం సంకోచించకుండా హైదరాబాద్ పంపించారు రజని, మోహన్ లు. అక్కడ  లేడీస్ హాస్టల్  లోనే ఉంటూ ఉద్యోగం చేస్తోంది జయ.
ఇప్పటికి రెండు సంవత్సరాలు అయింది జయ ఉద్యోగం లో చేరి. మంచి జీతం సంపాదిస్తోంది.  జయ తల్లి రజని , జయకి పెళ్లి చేయాలని చాలా తొందర పడుతోంది.
రాత్రి జయ కొంచం ఫ్రీ గానే ఉంటుంది కాబట్టి , రజని మళ్ళా ఫోన్ చేసింది జయకి.
" హలో , హ ! చెప్పమ్మా !, పొద్దున్న ఆఫీస్ కి వెళ్లే హడావిడి లో ఉన్నాను , అందుకే మాట్లాడలేదు " చెప్పింది జయ.
" సరెలేవే, నీకు ఎప్పుడూ ఉండే హడావిడే కదా , ఏనాడు కాస్త తీరికగా మాట్లాడావు గనక ! " అన్నది రజని.
" అలా కాదులేమ్మా ! చెప్పు ఏంటి సంగతులు "  అడిగింది జయ.
" ఏమిటంటావేమిటే !  నిన్ను చూసుకోడానికి వచ్చే ఆదివారం నాడు పెళ్లి వాళ్ళు వస్తున్నారు, చెప్పాను గా ఇంతకు ముందు " అన్నది రజని. 
" అమ్మా !  నీకెన్ని సార్లు చెప్పాను, నాకు ఇప్పుడే పెళ్లివద్దు అని " అన్నది జయ.
" అలా ఎన్నాళ్ళు హాస్టల్ కూడు తింటావే !  అలా ఒంటరి బతుకు ఎన్నాళ్ళు గడుపుతావ్, ఏ వయసులో జరగాల్సినవి  ఆ వయసులో జరగాలి. సరే ! ఇంతకీ నువ్వు వచ్చే ఆదివారం వస్తున్నావా లేదా "  అడిగింది రజని.
" చెప్పలేనమ్మా , అప్పటికి ఏ పని వచ్చి నెత్తిన పడుతుందో తెలీదు. తర్వాత చెప్తాలే " అని దాటేసింది జయ.
"  హబ్బా ! ఏం ఉద్యోగాలో   ఏంటో ! ఒక్కటీ నిలకడ ఉండదు ,  దేనిమీదా భరోసా ఉంచలేము,  ఏ ఉద్యోగాలో ఏంటో " అంటూ ఫోన్ పెట్టేసింది రజని. 
రజని ఆలోచనలో పడింది. జయకి ఇరవై అయిదు వయసు దాటాయి.  ఇప్పటినుండి సంబంధాలు చూస్తేగానీ మరో సంవత్సరానికి కుదర వచ్చు . కానీ ఈ పిల్ల ఇలా మొండికేసి కూచుంది.  ఆయనకేమో ఆఫీస్ తప్పితే ఇంటిగోడవె పట్టదాయె. ఖర్మ అన్నీ నేనే చూసుకోవాలి. ఎంపిల్లలో ఏంటో ! అనుకుంటూ వంటింట్లోకి వెళ్ళింది రజని. 
                                                                                
          * * *              * * *                 * * *                   
ఆఫీస్ లో సరోజ,  జయ  టేబుల్ దగ్గరకు వచ్చి " లేవవే పనిచేసింది చాలుగానీ , లంచ్ టైం అయ్యింది చూసుకోలేదా , అదికూడా నీకు గుర్తుచేయాలి .  ఎం మనిషో ఏమిటో అంటూ జయను కాంటీన్  కి తీసుకెళ్లింది సరోజ. 
భోజనం చేస్తూ,  "  ఏమిటే !  మీ టీం లీడర్ రాజేష్ , నిన్ను తెగ పొగిడేస్తున్నాడు , ఏంటి కథ, అడిగింది సరోజ .
" అంటే " అడిగింది,  జయ .
" అదేనే, ప్రేమ,  దోమ అంటూ ఎమన్నా ట్రై చేస్తున్నాడా ! అని , అన్నది సరోజ.
" ఏమోనే, నాకయితే అలా అనిపించలేదు, అతను పక్కా జెంటిల్మన్ " అన్నది జయ రాజేష్ గురించి చెబుతూ.
" అబ్బో, బాస్ ని అనగానే అమ్మాయి గారికి పొడుచుకొచ్చిందే " అన్నది సరోజ కొంచం వెటకారంగా  .
" లేదే ! రాజేష్ చాలా మంచివాడు, నాతో ఎప్పుడూ హద్దుమీరి ప్రవర్తించలేదు " అన్నది జయ. 
" మరేంటి , అంత మంచి వాడు అనుకున్నపుడు, నేవ్వే అతనికి ప్రొపోజ్ చెయ్యి " సలహా ఇచ్చింది సరోజ.
" ఎం ప్రొపోజ్ చెయ్యడం,  ఒకటే సంబంధాలు వస్తున్నాయి అని అమ్మ ఫోన్ ల మీద ఫోన్ లు చేస్తోంది.  అమ్మకు సమాధానం చెప్పలేక పోతున్నాననుకో. " అన్నది జయ , సరోజ తో.
" అంతే లేవే, పెద్దవాళ్ళు ! వాళ్ళ టెన్షన్ వాళ్ళకుంటుంది, "  అన్నది సరోజ.
జయ, సరోజ ఇద్దరూ ఒకే సాఫ్ట్వేర్ కంపెనీ లో పనిచేస్తున్నా ,  వాళ్ళ సీట్లు మటుకు వేరు వేరు ఫ్లోర్ లలో ఉంటాయి. లంచ్ టైం లో మటుకే ఇద్దరూ ఒకచోట కలిసి భోజనం చేస్తారు.
లంచ్ అవగానే సరోజ తనకు పెండింగ్ వర్క్ చాలా ఉంది అంటూ వెళ్ళిపోయింది.  
సరోజ వెళ్లనప్పటి నుంచి , జయ ఆలోచన లో పడింది.  ఏంటి రమేష్ ఏమన్నా నన్ను ఇష్టపడుతున్నాడా !  , మరి సరోజ ఎందుకు అలా అన్నది.  ఏమో,  రమేష్ అందరితోనూ స్ట్రిక్ట్ గ ఉంటాడు.  ప్రతి ఒక్కరి పనిలోనూ ఎదో ఒక తప్పులు పడుతూ ఉంటాడు. అందరినీ విమర్శిస్తూ ఉంటాడు,  పని ఇంకా ఇంప్రూవ్ చేయాలి అంటాడు.  పనిలో మటుకు చాల కరుకు గా ఉంటాడు, ఎక్కడా సర్దుకు పోయే గుణం కాదు.  కానీ తనను మటుకు ఎప్పుడూ ఏ మాటా అనలేదు.  ఒక్కోసారి మెచ్చు కుంటాడు కూడా.
కానీ మనిషి చూడటానికి చాల సాఫ్ట్ గా, జెంటిల్ గా ఉంటాడు.  మనిషి ఎప్పుడూ నీట్ గా ఉంటాడు.  క్రాఫ్ చెరగదు ,  పెదవి పై చిరునవ్వు కూడా చరగదు.  చాల పద్దతిగా, మర్యాదగా మాట్లాడుతాడు .  ఇక్కడ ఆఫీస్  లో  ఇంతమంది ఆడవాళ్లు పనిచేస్తున్నా,  ఏ ఒక్కరి తో కూడా హద్దు మీరు ప్రవర్తించినట్లు వినలేదు.
ఏంటి , తను  ఇలా ఆలోచిస్తోంది. కొంపదీసి తను గాని రాజేష్ ను ప్రేమిస్తోందా ! అనుకుంటూ తనను తాను ప్రశ్నించుకుంది.  చ ! అలాటిదేమీ లేదు , అనుకుంటూ పనిలో పడిపోయింది.
ఇంతలో మీటింగ్ కి రావాలంటూ రాజేష్ దగ్గరనుంచీ పిలుపు రానే వచ్చినది.  జయ మీటింగ్ లో కూచున్నదే గానీ తన ఆలోచన ఆంతా రాజేష్ మీదనే ఉంది.  మీటింగ్ మధ్యలో రాజేష్ తనని ఎక్కడున్నావ్ అంటూ వెటకారంగా కాషన్ చేసాడు.  ఎం లేదు ! అంటూ ఈ లోకం లోకి  వొచ్చింది జయ .
****                 ****                 ******                  
హాస్టల్ లో తన రూమ్ ఒచ్చింది వొచ్చింది కానీ మనసు మనసు లో లేదు.   ఎప్పుడు చూడు రాజేష్ ఆలోచన లోనే ఉంటోంది .  ఏదో పరధ్యానం  .  తనకే  అనిపిస్తోంది తాను రాజేష్ మీద మనసు పారేసు కుంది  అని .
ఇంతలో తన రూమ్మెట్ సరోజ వచ్చింది 
" ఎంటే ! ఒకటే పరధ్యానం , ఈమధ్య నువ్వు సరిగ్గా ఉండటం లేదు.  ఎక్కడో ఆలోచిస్తూ ఉంటావు . ఒకటడిగితే ఇంకో సమాధానం  ఇస్తావు .ఏంటి కథ " అన్నది సరోజ సరదాగా .
" ఏం లేదే ! ఏదో చిరాకు గా ఉంటోంది " అన్నది జయ . 
"  చిరాకు గా కాదు , పరాకు గా ఉంటోంది,   ఈమధ్య నువ్వు చాలా పరాకు  గా ఉంటున్నావు " అన్నది సరోజ. 
ఇంతలో సరోజ ఫోన్ మోగింది.  సరోజ ఫోన్ మాటాడుతోంది . వాళ్ళ మాటలు జయ గమనిస్తూనే ఉంది జయ. సరోజ ఫోన్ మాట్లాడటం అయ్యాక అడిగింది జయ సరోజ ని 
" ఏంటే ! ఎవరు ఫోన్ లో " ఏంటి వ్యవహారం "  అడిగింది జయ .
" ఏం లేదు , ఈ హాస్టల్ కూడు తినలేక  చస్తున్నాం కదా !  అందుకని ఒక  ఇల్లు  అద్దెకు తీసుకుని , వంట మనిషి ని పెట్టుకుంటే బెటర్ అనిపిస్తోంది , దానికోసం ఇల్లు వెదుకు తున్నాము "  అన్నది సరోజ . 
" అంటే హాస్టల్ ఖాళీ చేసి వెళ్ళిపోతావా ! " అడిగింది జయ. 
" ఒక పని చెయ్యవే, నువ్ కూడా హాస్టల్ ఖాళీ చేసి నాతోపాటు వచ్చేయి " అన్నది సరోజ .
" మనము  విడిగా ఉంటె సెక్యూరిటీ ఉండదు లెవె, నేను రాను , నువ్ కావాలంటే వెళ్లు "  అన్నది  జయ. 
సరోజ  ఏమీ  మాట్లాడకుండా వెళ్ళిపోయింది. 
జయ అలాగే తన ఆలోచన పొడిగించి రమేష్ తో  ఊహాలోకం లో విహరించి నిద్ర లోకి జారుకున్నది .

*****       *****      *******
సరోజ మళ్ళా ఒకరోజు జయ ఆఫీస్ టేబుల్ దగ్గెర ప్రత్యక్షమయింది . 
" ఏమే ! ఏమైంది రెండ్ రోజులు గా కనిపించడం లేదు , ఏమైపోయావ్ ! " అడిగింది  సరోజని జయ ఆశ్చర్యంగా. 
"  ఏంలేదు , ఆఫీస్ కి వస్తున్నాను , కానీ నా టేబుల్ వదిలి రావడానికి అస్సలు కుదరడం  లేదు , పని చాలా ఎక్కువగా ఉంది. లంచ్ చేసే టైం కూడా దొరకడం లేదు " అని జవాబిచ్చింది సరోజ. 
"  ఏంటి సంగతి ! ఎలా ఉంది నీ కొత్త ఇల్లు , కొత్త జీవితం , కొత్త వంట  కొత్త రూమ్ మేట్స్ " అడిగింది జయ. 
" కొత్త రూమ్ మేట్స్ తో ఇబ్బంది లేదు గానీ,  కొత్త వంట నే కాస్త ఇబ్బంది గానే ఉంది . ఇంత  వరకు వంట కి మనిషి కుదరలేదు  . మనమే వంట చేసుకోవాలి అన్నది  సరోజ .  ఇలాగే ఆరు నెలలు గడిచాయి. 
****        *****       ******       ****** 
ఫోన్  రింగ్ విని సరోజ బాత్రూం లోంచి బయటకు వచ్చింది . ఫోన్  చేతిలోకి తీసుకునే సరికి  రింగ్ ఆగిపోయింది . కాల్ వచ్చింది జయ వాళ్ళ అమ్మ దగ్గరనుండి. 
ఏంటి జయ వాళ్ళ అమ్మ నాకు  చేశారు , అనుకుంటూ , మళ్ళా తను జయ వాళ్ళ మమ్మీ రజని గారికి ఫోన్ చేసింది . ఆమె వెంటనే  ఫోన్ తీశారు .
 " నమస్తే ఆంటీ ! చెప్పండి" అన్నది సరోజ 
" ఏం లేదమ్మా !  మా జయ కి ఫోన్ చేస్తున్నా!  ఎన్నిసార్లు చేసినా ఫోన్ తీయడం లేదు. కొంచం పిలుస్తావా ! " అడిగిందింది సరోజను రజని .
" ఆంటీ ! ఇపుడు నేను జయ తోపాటు హాస్టల్ లో ఉండటం లేదు. వెరీ చోట ఉంటున్నా " అన్నది  సరోజ .
" అవునా అమ్మా ! పోనీ ఒక పని చేస్తావా ,మా జయని ఒకసారినాకు ఫోన్ చెయ్యమని చెప్పమ్మా ! అన్నది సరోజను మళ్ళీ మాట్లాడనీయకుండా,
" సరే ఆంటీ ! చెప్తాను " జవాబిచ్చింది సరోజ .
*******       ********      ********      ********
 మరుసటి రోజు సరోజ,  జయ సీట్  దగ్గరకు వెళ్లి , " నిన్న నువ్వు సాయంత్రం రూమ్ లో లేకుండా ఎక్కడికెళ్ళావ్ "  అడిగింది జయ ను .
" మా ఫ్రెండ్ తో షాపింగ్ కి వెళ్లేను " అన్నది జయ. 
" ఏంటే అంత షాపింగ్ ! మీ అమ్మ ఫోన్ చేస్తే కూడా ఫోన్ తీయనంత  షాపింగ్ ! " అడిగింది సరోజ .
" ఫోన్ ఇంట్లో మర్చి పోయి వెళ్లానులె ! " అన్నది జయ. 
" ఇంట్లో మర్చిపోయి వెళ్ళటం ఏంటి ? ఇల్లేంటి ? అయినా నువ్వు రూమ్ ఖాళీ చేశావంట ! మీ హాస్టల్ వార్డెన్ చెప్పింది "  అడిగింది సరోజ అసహనంగా .
" అవును ,  ఇప్పుడు నేను వేరే చోట ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నా . " జవాబిచ్చింది గర్వాంగా . 
" ఇల్లు అద్దెకు తీసుకోడం ఎందుకే ! అయినా హాస్టల్ బాగానే ఉందిగా, "  అడిగింది సరోజ ఏమీ అర్ధం కానట్టుగా , కొంచం విసుగ్గా .
ఏమీ సమాధానం ఇవ్వలేదు జయ. మౌనంగా కూచుంది కంప్యూటర్ వైపు చూస్తూ. 
" జవాబు చెప్పవేంటే , నీ ఒక్కదానికి అంత అద్దె పెట్టి ఇల్లు తీసుకోవడం అవసరమా ? " అడిగింది కొంచం కోపంగా చనువుతో. 
" లేదులేవే , ఇపుడు నేను " సహజీవనం చేస్తున్నా  ! " అన్నది జయ  .
" సహజీవనం ఏమిటి , ఎవరితో  " అడిగింది జయ కొంచం భయంగా . 
" అంత భయపడాల్సిన పని లేదు, నేను ఉండేది రమేష్ తోనే " అన్నది జయ ఆత్మ విశ్వాసం  తో .
" ఏమోనే బాబు, నువ్వు , నీ పోకడలు నాకేమీ అర్ధం కావడం లేదు , ఎంతయినా జాగ్రత్త గా ఉండు, ఆ , మీ అమ్మగారికి ఫోన్ చెయ్యి, మర్చిపోకు, లేకుంటే ఆమె మళ్లా నాకు ఫోన్ చేస్తారు " అని చెప్పి వెళ్ళిపోయింది.
******.   *******.   *******.  ******* 
జయ వాళ్ళ అమ్మకు ఫోన్ చేసింది . 
" అమ్మ చెప్పు ! ఫోన్  చేశావట ! " అన్నది జయ .
" ఫోన్ చేశావంట ఏవిటే ! ఎన్నాళ్ళయింది నువ్వు మాతో మాట్లాడి. మీ నాన్న గారు కూడా ఎంత ఖంగారు పడ్డారో తెలుసా ! నీకసలు ఏమైనా తెలుస్తోందా ? " అడిగింది రజని కూతురు జయ తో కొంచం ఆవేశము, బాధ , ప్రేమ కూడిన స్వరం తో . 
" ఎం కాలేదు లేమ్మా ! నేనేమీ తప్పిపోలేదుగా ! "  అని ఆమె మాటను తేలికగా తీసిపారేసినట్లు మాటాడింది జయ. 
"  సరేలే, ఏంటి సరోజ నీతో హాస్టల్ లో ఉండటం లేదట గా " అడిగింది రజని. 
" అవును ! వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి ఇల్లు తీసుకుని ఉంటోంది" ...జవాబిచ్చింది . 
"  అమ్మా ! నాకు అర్జెంటు కాల్ మరొకటి వస్తోంది, నీకు మళ్ళా చేస్తాను " అని ఫోన్ పెట్టేసింది జయ. 
*****.   *****.   ******    *******
ఒక  సంవత్సరం గడిచాక .....
ఒక రోజు  ఆఫీస్ లో సరోజ , జయ టేబుల్ దగ్గరికి వచ్చేసరికే , జయ ఏడుస్తూ కనపడింది. 
" ఏంటే! ఎందుకు ఏడుస్తున్నావ్ ! " అడిగింది ఖంగారుగా .
" ఏంలేదు " జవాబిచ్చింది జయ ఏడుస్తూ నే . 
" చెప్పవే , బాస్ ఏమన్నా అన్నాడా ? "  అడిగింది సరోజ అసహనం గా.
" లేదు " సమాధానమిచ్చింది జయ ఏడుస్తూనే. 
" ముందా  ఏడుపు ఆపు, జరిగేమిటో చెప్పు " అడిగింది జయ కొంచం విసుగ్గా. 
" నేను మోసపోయానే , అన్యాయమైపోయాను  " అన్నది కొంచం ఏడుపు తగ్గించి .
" ఏంటే , ఎం జరిగింది , " ,అడిగింది సరోజ. 
జరిగింది వివరంగా చెప్పింది జయ , సరోజ కు. 
" సరే !  నాకు తెలిసిన లాయర్ అంకుల్ ఉన్నారు.  నేను వారి తో మాట్లాడి నీకు అప్పోయింట్మెంట్ ఫిక్స్ చేసాను , నువ్వు దేర్యం గా ఉండు " అని చెప్పి వెళ్ళిపోయింది సరోజ. 
****.  *****.          *****.  *****.        **** ****
వారం రోజుల తర్వాత .....
" జయా ! లాయర్ తో అప్పోయింట్మెంట్ ఫిక్స్ అయింది , వీకెండ్ , శనివారం రోజున రమ్మన్నారు. ". అన్నది సరోజ .
లాయర్ దగ్గరకు వెళ్లబోయే ముందు , లాయర్ తో ఎం మాట్లాడాలో, సరోజ , జయ ఇద్దరూ మాట్లాడుకున్నారు. 
" సరేలే ! ఏదయినా , మనం చెయ్యగలింది కాదుగా , లాయర్ గారితో చెప్పి చూద్దాం " అని జయకు సర్ది చెప్పి జయను లాయర్ దగ్గరకు తీసికెళ్ళింది సరోజ. 
*****. ******.      ***** *****.     **** ***** 
ఇద్దరూ లాయర్ గారి దగ్గరకు వచ్చారు . లాయర్ గారి పేరు  విశ్వనాధ్ .  అందరూ ఆయన్ని ' నాథ్ ' అని పిలుస్తారు. సరోజ, జయ ఇద్దరూ వెళ్ళగానే , లాయర్ నాథ్ గారు లోపలి రమ్మన్నారు. 
" నమస్తే సర్ " అని చెప్పి జయ, సరోజ ఇద్దరూ  నిలబడి ఉన్నారు. 
" కూచోండి ! అన్నారు లాయర్ గారు  కుర్చీ చూపిస్తూ. 
" థాంక్ యు సర్ " అని చెప్పి కూచున్నారు ఇద్దరూ. 
" చెప్పండి జయ గారు , " అని అడిగారు లాయర్. 
" మమ్మల్ని పేరు పెట్టి పిలవండి  సార్ ! మీరు మాకన్నా  చాల పెద్దవారు " అన్నది జయ. 
" ఓకే అలాగే, చెప్పమ్మా ! " అన్నారు లాయర్ గారు. 
జయ చెప్ప సాగింది ......
నేను ఒక అతని వల్ల మోసపోయాను సార్, ఫలితం గా , గర్భవతి నయ్యాను . 
" అతను నిన్ను పెళ్లి చేసుకోనంటున్నాడా " అడిగారు లాయర్.
" మేమిద్దరం ' సహజీవనం " లో భాగం గా ఒకే ఇంట్లో ఉంటున్నాము " చెప్పింది జయ. 
". ఓహ్! ఈమధ్య ఇది ఒక కొత్త విధానం తయారయ్యింది. దీని వాళ్ళ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు " అన్నారు లాయర్ గారు . 
" ఓకే ! , సహజీవనం లో ఉంటూ ఉండగా తొందర పడ్డారు, కానీ తొందరపడటం లో అతను కూడా భాగస్తుడే కదా, నువ్వు అతనిని నిలదీయలేదా. అసలు ' సహజీవనం ' చెయ్యాలి అనే ఆలోచన నువు చేసావా లేదా అతను చేశాడా ?  " అడిగాడు లాయర్. 
ఏడవటం మొదలుపెట్టింది జయ. 
" ఏడవకమ్మా, ఇపుడు ఏడ్చి ఎం ప్రయోజనం, ముందే ఆలోచించాలి కదా " అన్నారు లాయర్ గారు. 
" అతను నా సీనియర్ సార్,  ఆల్మోస్ట్ నా బాస్ " అన్నది జయ. 
" ఓకే, నీ బాస్ అయినంత మాత్రాన , ' సహజీవనం ' చెయ్యడానికి అతను బలవంతం చేశాడా ? " అడిగారు లాయర్ గారు. 
" లేదు సార్ , నా వైపునుంచి నేను అతన్ని ప్రేమించాను , అతన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాను ,  ముందు అతను ఎటువంటి వాడో  తెలుసు కుని , తర్వాత పెళ్లి చేసుకుందామని అనుకున్నాను " 
" సరే,  అతను ఎటువంటి వాడో తెలుసుకోడానికి , ఇలా ఇద్దరూ కలిసి ఒక ఇంట్లో ఉండటం , భార్య భర్తల లాగా కాపురం చెయ్యడం ,  ఇంత రిస్క్ తీసుకుని , ఇదంతా చెయ్యాల్సిన ఆవసరం ఉందా చెప్పమ్మా ! అడిగారు లాయర్ .
" సారి సర్ " అన్నది జయ ఏడుస్తూ నే. 
" సరే నువ్వు, అతనితో సహజీవనం చేస్తున్న సంగతి ఇదంతా జరిగిన సంగతి మీ తల్లిదండ్రులకు తెలుసా " అడిగారు లాయర్. 
" తెలియదు సార్. " చెప్పింది జయ. 
"  సరే, నువ్వు గర్భవతివి అన్న సంగతి అతనికి చెప్పావా " అడిగారు లాయర్. 
" చెప్పను సార్ ,  పైగా అతను ఇప్పుడు వేరే అమ్మాయిలతో తిరుగుతుంటాడు. ఇంటికి కూడా ఒకరోజు వస్తాడు , ఒకరోజు రాడు. అతనికి ఇప్పుడు నేను అవసరం లేదు అన్నట్టుగా ప్రవర్తిస్తాడు సార్. " అన్నది జయ. 
" సరే ఒక పని చెయ్యండి, అతన్ని ఇక్కడకు ఒకసారి పిలుచుకు రా గలరా !  నేను ఒకసారి మాట్లాడుతాను , " అన్నారు లాయర్ గారు. 
సరే  అని , ఆరోజు కు సెలవు తీసుకుని అక్కడనుంచి వెళ్లి పోయారు సరోజ, జయ ఇద్దరూనూ.
****.   *****.            *****.   *****
పదిహేను రోజుల తర్వాత , సరోజ, జయ ఇద్దరూ రమేష్ ను పిలుచుకుని వచ్చారు. లాయర్ గారు లోపలి రమ్మని ముగ్గురినీ కుచోమన్నారు. 
లోపలి రాగానే ముగ్గురూ లాయర్ గారికి నమస్కరించారు. లాయర్ గారు కూడా వాళ్లకు ప్రతిమమస్కారం పెట్టి కుచోమన్నారు. ముగ్గురూ కూచున్నారు, కూచోవటం కూడా రమేష్ చాల కాన్ఫిడెంట్ గా కుర్చీలో పూర్తిగా ఆనుకుని కూచున్నాడు. అతని కూచునే పద్ధతి చుస్తే " ఎవరు ఏ ప్రశ్న వేసినా నేను సమాధానం చెప్పగలను, ఎవరికీ నేను తల వంచను "  అన్నట్టుగానే ఉంది . 
మాటలు మొదలుపెట్టడం , లాయర్ గారు తనను తాను పరిచయం చేసుకున్నారు . జయ , సరోజ కూడా రమేష్ ను లాయర్  గారికి పరిచయం చేశారు. లాయర్ గారు జయ వైపు చూసి, " రమేష్ గారిని ఇక్కడకు ఎందుకు రమ్మన్నామో చెప్పారా " అని జయ ను అడిగారు. 
" ఆ ! చెప్పాను సర్ ! " అన్నది జయ కొంచం ఇబ్బంది గా . 
ఓకే మిస్టర్ రమేష్, ఇదేమీ కోర్టు కాదు, మనం ఫ్రెండ్లీ గా మాట్లాడుకుందాం , మీకు అభ్యంతరం లేదుగా " అడిగారు లాయర్ గారు రమేష్ ని. 
" లేదు సర్, నో ప్రాబ్లెమ్ " అన్నాడు రమేష్. 
" ఓకే రమేష్, మీరు , జయ పెళ్లి చేసుకున్నారా ! " అడిగారు లాయర్ గారు ప్రశాంతం గా చిరునవ్వుతో. 
" లేదు సర్, వి అర్ లివింగ్ టుగెదర్ , కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నాము " జవాబిచ్చిచ్చాడు రమేష్. 
" ఓకే , ఈమధ్య ఇదో కొత్త పద్ధతి వచ్చింది కదా , ఫైన్ " అని ఒక చిరునవ్వు విసిరాడు లాయర్. 
" మరి ....పెళ్లి చేసుకోబోతున్నారా ? " అడిగారు లాయర్. 
" అలా ఏమీ నిర్ణయించుకోలేదు సర్ " చేసుకోవాలి అని  ఏమీ అనుకోలేదు కూడా " అన్నాడు రమేష్ ఏమాత్రం తొణుకు బెణుకూ లేకుండా . 
" మరి, ఏంటమ్మా ప్రాబ్లెమ్ , " అన్నారు లాయర్ , జయ తో. 
" అతనికి వేరే లేడీస్ తో కాంటాక్ట్స్ ఉన్నాయి సార్ " అన్నది జయ. 
" చుడండి రమేష్, ఇది చాల సెన్సిటివ్ ఇష్యూ, ఇద్దరి జీవితాలకి సంబందించినది, మీరు జయ గారితో కలిసి జీవిస్తూ, అంటే ఒకే ఇంట్లో ఉంటూ, మరొక లేడీస్ తో సంబంధం పెట్టుకోవడం సరికాదు కదా ! " అడిగారు లాయర్ గారు,  ఎంతో ప్రశాంతం గా . 
" అందులో తప్పేముంది సార్ "  ఎదురు అడిగాడు రమేష్ అంతే ప్రశాంతం గా. 
ఈసారి అతని గొంతులో కొంత వెటకారం వినిపించింది ." ఓకే ఒకే , మరి ఒకపక్క జయ గారితో సహజీవనం చేస్తూ మీరు వేరే లేడీస్ తో కూడా సంబంధాలు పెట్టుకోవడం, ఏమన్నా సరిగా ఉందా ! " అడిగారు లాయర్ గారు బిజ్జగింపుగా. 
"  అది మేము మొదలే  అనుకున్నాం సార్, చెప్పలేదా , అని జయ వైపు చూసాడు రమేష్ . వెంటనే తన బ్రీఫ్ కేసు లోంచి  ఒక పేపర్ తీసి లాయర్ గారి చేతికి ఇచ్చాడు. అది బాండు  పేపర్ మీద టైపు చేసిన మేటర్ ఉన్న కాయితం . ఒరిజినల్ కాదు , జిరాక్స్ కాపీ ఇచ్చాడు . 
" ఇది మా ఇద్దరి మధ్య ఉన్న అగ్రిమెంట్ సార్. దీనిప్రకారం నేను ఏ లేడీస్ తో అయినా మాట్లాడ వచ్చు, కలిసి ఎక్కడికయినా వెళ్ళవచ్చు. అలాగే తాను కూడా ఎవరితనైనా మాటాడ వచ్చు, కలిసి తిరగ వచ్చు . ఇది నాకు జయ కు ఉన్న అగ్రిమెంట్ సార్ . "  అన్నాడు రమేష్ . 
" మరి అయితే, పెళ్లి ఎపుడు చేసుకో బోతున్నారు మీరు ఇద్దరూ " అన్నారు లాయర్ గారు రమేష్ తో, జయ, రమేష్ లను చూస్తూ . 
" నాకు ఆ ఉద్దేశ్యం ఏమీ లేదు సార్ , నాకు మా తల్లిదండ్రులు వేరే అమ్మాయితో పెళ్లి చేయాలని అనుకుంటున్నారు " అన్నాడు రమేష్. 
" అదేంటి రమేష్, ఒకపక్క ఆ అమ్మాయి జయ గర్భవతి గా ఉంది, అది నీ వలన జరిగింది , దానికి నీకు బాధ్యత లేదా ! " అడిగారు లాయర్ గారు. 
" అదేంటి సార్ , అలా అంటారు నేనేదో తప్పు చేసినట్లు,  అది ఆమె చూసుకోవాలి సార్ , ఆమె ఇష్టం  లేకుండా ఏదీ జరగదు కదా ! " ఎదురు అడిగాడు రమేష్. 
లాయర్ గారు జయ వైపు చూసారు , జయ యాడవటం మొదలుపెట్టింది . 
" ఓకే రమేష్ , థాంక్ యు , " అన్నారు లాయర్ గారు రమేష్ ను ఇక నువ్వు వెళ్లొచ్చు అన్నట్టు .
రమేష్ వెళ్ళిపోయాక .......
" చూడమ్మా జయా ! ఇది పరిస్థితి. అతని మాట వాలకం చుస్తే , ఏమాత్రం నిన్ను పెళ్లి చేసుకునే ఆలోచన అతనికి ఉన్నట్టు లేదు. నువ్వు అతనితో  నిన్ను పెళ్ళిచేసుకోవాలని గట్టిగా అడగలేదా ! " అడిగారు లాయర్ గారు .
" చాలా సార్లు అడిగాను సార్ , అడిగిన ప్రతి సారి ఇలాగే మాటాడుతాడు " అన్నది జయ ఏడుపు ఆపుకుంటూ . 
" అగ్రిమెంట్ మీద సైన్ చేసేటపుడు , అగ్రిమెంట్ చదవలేదా ? చదివి సంతకం చెయ్యలేదా ? అడిగారు లాయర్ .
" చదివాను సార్ ! కానీ సహజీవనం లో కొన్నాళ్ళు గడిచాక అతనిమీద నాకు ప్రేమ కలిగింది, అతను ప్రవర్తన చూసి అతను నన్ను పెళ్లిచేసుకుంటాడు అనుకున్నాను "  జవాబిచ్చింది జయ. 
" నువ్వు అనుకుంటే సరిపోదు కదమ్మా , అతను దృఢం గా ఉన్నాడా లేదా అన్నది నువ్వు అతనితో కమిట్  అవకముందే తేల్చుకోవాలి. ఓకే ! నువ్వు అతనితో సహజీవనం లో ఉన్నసంగతి మీ తల్లిదండ్రులకు , అతని తల్లిదండ్రులకూ తెలుసా ? " అడిగారు లాయర్ గారు. 
" మా పేరెంట్స్ కి తెలీదు సార్ " చెప్పింది జయ .
" అతని పేరెంట్స్ కి తెలుసా  " అడిగారు లాయర్ " 
"  అతని పేరెంట్స్ కి తెలుసోలేదో , నాకు తెలీదు సార్ " అన్నది జయ. 
సరోజ పరిస్థితి చాలా ఇబ్బంది గా ఉంది .  జయ మీద 
చాలా కోపంగా ఉంది . ఇంత జరిగినా జయ తనకు  ముందుగా చెప్పలేదు. 
వెంటనే లాయర్ గారు కల్పించుకుని " అసలు అయినా ఈరోజుల్లో పిల్లలకు ఈ " సహజీవనం " అన్న పద్దతి ఎందుకు అలవాటు అయిందో అర్ధం కావడం లేదు.  నీ విషయం లో , నీతో పాటు మీ ఫ్రెండ్ మరొకరు రూమ్ లో ఉంటె కొంచం కంట్రోల్ ఉండేది. మన భారతీయ సంప్రదాయం ప్రకారం , పెళ్ళికాకుండా గర్భవతి అయినా ఆడపిల్ల కు సమాజం లో విలువ ఉండదు. ఇంకొకరు పెళ్లిచేసుకోవడం చాల కష్టం. ఆ అమ్మాయి ఫామిలీ కి, తల్లిదండ్రులకు చెడ్డ పేరు. ఇంట్లో మరొక ఆడపిల్ల ఉంటె ఆ పిల్లకు పెళ్లి అవడం కష్టం. ఎమ్మా ! ఇలాంటి విషయాలు నువ్వు అసలు ఆలోచించలేదా ? " అడిగారు లాయర్ గారు . 
జవాబు చెప్పకుండా కళ్ళు తుడుచుకోవడం తప్ప ఏమీ చెయ్యలేదు జయ. 
" మీరే ఏదో ఒక  పరిష్కారం చుడండి సార్, మీలాంటి పెద్దల దగ్గరకు మేము వచ్చింది మీరు ఏదో ఒక ఆలోచనతో సహాయం చేస్తారని వచ్చాము . మీరే ఇలా చెబితే మాకు వేరే దిక్కు ఏమీ లేదు "  అన్నది సరోజ ఎంతో బ్రతిమిలాడుతున్నట్లు. 
" సరేనమ్మా !  అతను మీరు చేసిన అగ్రిమెంట్ కూడా చుపిస్తున్నాడుగా . అంటే లీగల్ గా అతన్ని మనం ఏమీ చేయలేము. అది అతనికి కూడా బాగా తెలుసు అన్నట్టు మాటాడుతున్నాడు. నేను మాటాడుతున్నపుడు అతను ఏమాత్రం భయం, బెరుకు లేనట్టే ప్రవర్తించాడు. అతనితో సహజీవనం చేసే విషయం , మీ తల్లిదండ్రులకు గానీ, మీ స్నేహితురాలు సరోజ  కు గానీ , మరెవ్వరికీ తెలియ కుండానే చేసావు. వీళ్ళలో ఎవరికీ తెలిసినా నువ్వు అతని తో కలిసి జీవించడమే తప్పు అని నిన్ను వారించే వారు. 
" నేను అతన్ని ప్రేమించాను సార్ , పెళ్లి చేసుకుందామని అనుకున్నాను. " అన్నది జయ. 
" అవునమ్మా !  ఎక్కడన్నా పెళ్లి చేసుకున్నాక, సహజీవనం ఉంటారు , కానీ మీరు ముందు సహజీవనం చేసి , తర్వాత పెళ్లి అంటున్నారు. అదీకూడా నువ్వు అంటున్నావ్ కానీ అతను, వాళ్ళ తల్లిదండ్రులు వేరే సంబంధం చూస్తున్నారు అంటున్నాడు. ఇపుడు నీ పరిస్థితి అరిటాకు, ముళ్ళు సామెత లెక్క అయింది.  ఈ మధ్య సుప్రీమ్ కోర్ట్ కూడా , ఇద్దరికీ సమ్మతమైతే ఒక ఆడ, ఒకమొగా సంబంధం పెట్టుకుంటే తప్పు కాదు చట్టరీత్య నేరం కాదు అని చెప్పింది . నువ్వు అగ్రిమెంట్ మీద సంతకం పెట్టావు కాబట్టి , మనం లీగల్ గా కూడా వెళ్లలేము " అన్నారు లాయర్. 
మళ్ళా లాయర్ గారే , " సరేలే నేనే ఏదో ఒకటి ఆలోచిస్తాలే , తర్వాత మీకు చెప్తాను అన్నారు .
సరోజ , జయ అక్కడినుంచి బయలుదేరి వచ్చేసారు. జయ వెంటనే అదే రోజు , రమేష్ తో ఉంటున్న ఇంటి నుండి తన సామాన్ల తో సహా సరోజ తో పాటు కలిసి ఉండేందుకు , సరోజ దగ్గరకు వచ్చేసింది. ఆరోజు నుంచి జయ ఆఫీస్ లో పనిచేస్తోంది కానీ , రమేష్ తో ఆఫీస్ మాటలు తప్ప వేరే మాటలు మాట్లాడటం లేదు. 
****   *****.            *****.    ****
మూడు వారాల తర్వాత  ......
" లాయర్ గారు ఫోన్ చేశారు రేపు శనివారం 11 గం . కు వాళ్ళ ఆఫీస్ కు రమ్మన్నారు  " అన్నది సరోజ, జయతో. 
" అలాగే వెళదాం " అన్నది జయ 
సరోజ, జయ ఇద్దరు  లాయర్ గారి దగ్గరకు చేరిన పది నిముషాలకు రమేష్ కూడా అక్కడికి వచ్చాడు.  
లాయర్ గారు ఇంకా రాలేదు ఆఫీస్ కి. జయ, సరోజ ఇద్దరూ రమేష్ ని పలకరించలేదు. రమేష్ కూడా వాళ్ళని పలకరించలేదు. అందరూ ముభావంగానే ఉన్నారు.  ఎవరికి వాళ్ళు  వాళ్ళ సెల్ చూసుకుంటూ కూచున్నారు.  ఒక అయిదు నిముషాల తర్వాత లాయర్ గారు వచ్చి అందరినీ ఒకేసారి పలకరించారు . అందరూ  లాయర్ గారి రూమ్ లోకి వచ్చి ఆయన కుచోమన్నాక కూచున్నారు. 
లాయర్ గారు రమేష్ ని ఎందుకు పిలిచారో సరోజ, జయ లకు కొంచం ఆలోచన గానే ఉంది. 
" చెప్పండి రమేష్ !  " అన్నారు లాయర్ గారు తన స్వరం లో కొంత అధికారం చూపిస్తూ. 
" అలాగే సార్ " అన్నాడు రమేష్ చాలా వినయం తో కూడిన స్వరం తో. 
రమేష్ గొంతు విని ఒక్కసారి ఆశ్చర్యం గా తల ఎత్తి చూసారు  సరోజ, జయ ఇద్దరూనూ .
" మీరు చెప్పినట్లే చేస్తాను సార్ !  జయ ను పెళ్లి చేసుకుంటాను " అన్నాడు రమేష్. 
జయ కు ఆశ్చర్యం తో కూడిన ఆనందం కట్టలు తెంచుకు వస్తోంది. కానీ బయటపడకుండా రమేష్ లో ఇంత మార్పుకు కారణం ఏంటి అన్న ప్రశ్న కు సమాధానం కోసం వెతుకుతున్నట్లు చూసింది. 
రమేష్ గొంతు లో వచ్చిన మార్పు కు , ఆశ్చర్యం లోంచి బయటకు రావడానికి రెండు నిముషాలు పట్టింది సరోజకు. 
లాయర్ గారి ఎదురు గా ఉన్నంత సేపు రమేష్ వినయం గా మాట్లాడి, సరోజ, జయ లను కూడా వెళ్ళేటపుడు పలకరించి రెండు నిముషాలు మాట్లాడి వెళ్ళాడు. 
రమేష్ వెళ్లిన తర్వాత లాయర్ గారు జరిగినది చెప్పా సాగారు. 
" ఈ మూడు వారాలలో  నేను జయ వాళ్ళ  ఇంటికి వెళ్లి జయ  తల్లి దండ్రులకు , ఈ జరిగిన విషయం చెప్పాను.  జయ తల్లిదండ్రులను రమేష్ వాళ్ళ ఊరుకు తీసుకెళ్లి , రమేష్ ను కూడా అక్కడికి పిలిపించి , ఊరిపెద్దలను కూడా కూచోపెట్టి మాట్లాడాను.  రమేష్ తల్లిదండ్రులకు జరిగిన విషయం తెలిసాక , రమేష్ ని గట్టిగా మందలించి , అక్కడ ఊరిపెద్దలు చెప్పే మాట అందరూ పంచాయతీ లో వింటారు కాబట్టి వాళ్ళ చేత కూడా చెప్పించి రమేష్ ను ఒప్పించాను . అతను కూడా ఒప్పుకోక తప్పలేదు. "  అని  జరిగిన విషయం చెప్పారు. 
వారం రోజుల తర్వాత జయ తల్లిదండ్రులు, రమేష్ తల్లిదండ్రులను పిలిపించి రిజిస్ట్రార్ ఆఫీస్ లో రిజిస్టర్ మ్యారేజ్ చేయించారు.  
" మీరు మీ సంప్రదాయం ప్రకారం మంచి ముహూర్తం చూసి వీళ్ళ ఇద్దరికీ వివాహం జరిపించండి " అని చెప్పారు. 
" జయ , తన జీవితాన్ని నిలబెట్టిన లాయర్ గారికి ధన్యవాదములు చెబుతూ నమస్కరించింది. " 
  ఇటువంటి " సహజీవనం " చెయ్యడం అనే తప్పు, సహజీవనం చేస్తూ మరిన్ని తప్పులు చెయ్యడం  , వంటివి మరెవ్వరూ చెయ్యకుండా చుడండి, మీ స్నేహితులకు, సహా ఉద్యోగస్తులకు , మీకు తెలిసిన వారందరికీ చెప్పండి " అని సలహా చెప్పారు. 
జయ తల్లిదండ్రులు, రమేష్ తల్లిదండ్రులు , సరోజతో సహా అందరూ లాయర్ గారికి నమస్కరించి సెలవు తీసుకున్నారు. 
                     ( అయిపొయింది ) 



కామెంట్‌లు
Shyam Kumar chagal చెప్పారు…
ప్రస్తుతం యువత లో ఈ విపరీత పోకడ లు చోటు చేసుకున్న సమయంలో ఈ కథ నుంచి నేర్చుకో వలసినది చాలా వుంది. అభినందనలు
పద్మ సత్తి చెప్పారు…
మారుతున్న విలువలు, వాటి వల్ల వచ్చే సమస్యల గురించి చాలా బాగా రాశారు. కథ ,కథనం చాలా బాగుంది. జయ విలువలతో పెరిగినప్పటికీ తన పరిసరాల ప్రభావం వల్ల సహజీవనం లాంటి ఆధునిక పోకడలకు మొగ్గు చూపింది. సహజీవనం చేస్తూనే ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఉండవచ్చు అని రాజేష్ తో వేసుకున్న ఒప్పందం లోనే రాజేష్ కి ప్రేమ లాంటి ఏ కమిట్మెంట్ లేదు అని అర్థమౌతోంది. రాజేష్ చేసింది మోసం అని అనలేము . అంతను అన్ని విషయాల్లో క్లారిటీ ఇచ్చాడు. బహుశా జయ కొంత కాలం తర్వాత తన ప్రవర్తన చూసి అతను ప్రేమిస్తాడు అనుకుని ఉండొచ్చు. కథ కాబట్టి సుఖాంతం అయ్యింది.
కానీ అలా తన మీద ప్రేమ లేని, ఇంకా ఎందరితోనో సంబంధాలు ఉండి, లైఫ్ కేవలం ఎంజాయ్ చేయడం కోసం అనుకునే లాంటి రాజేష్ ను పెద్దల బలవంతం వల్ల పెళ్లి చేసుకుని జయ ఏం సుఖ పడుతుంది !
ఇటువంటి రిలేషన్స్ వల్ల ఎలాంటి సమస్యలు ఎదురౌతాయి అన్నది రచయిత సత్య ప్రసాద్ గారు బాగా చెప్పారు. సమకాలీన సమస్యలను కథలుగా మలచి, వాటికి పరిష్కారాలు సూచించే విధంగా ఉన్న మీ రచనలు చాలా చదివాను.అన్నీ బాగున్నాయి.అభినందనలు.
Satti Padma Reddy చెప్పారు…
మారుతున్న విలువలు, వాటి వల్ల వచ్చే సమస్యల గురించి చాలా బాగా రాశారు. కథ ,కథనం చాలా బాగుంది. జయ విలువలతో పెరిగినప్పటికీ తన పరిసరాల ప్రభావం వల్ల సహజీవనం లాంటి ఆధునిక పోకడలకు మొగ్గు చూపింది. సహజీవనం చేస్తూనే ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఉండవచ్చు అని రాజేష్ తో వేసుకున్న ఒప్పందం లోనే రాజేష్ కి ప్రేమ లాంటి ఏ కమిట్మెంట్ లేదు అని అర్థమౌతోంది. రాజేష్ చేసింది మోసం అని అనలేము . అంతను అన్ని విషయాల్లో క్లారిటీ ఇచ్చాడు. బహుశా జయ కొంత కాలం తర్వాత తన ప్రవర్తన చూసి అతను ప్రేమిస్తాడు అనుకుని ఉండొచ్చు. కథ కాబట్టి సుఖాంతం అయ్యింది.
కానీ అలా తన మీద ప్రేమ లేని, ఇంకా ఎందరితోనో సంబంధాలు ఉండి, లైఫ్ కేవలం ఎంజాయ్ చేయడం కోసం అనుకునే లాంటి రాజేష్ ను పెద్దల బలవంతం వల్ల పెళ్లి చేసుకుని జయ ఏం సుఖ పడుతుంది !
ఇటువంటి రిలేషన్స్ వల్ల ఎలాంటి సమస్యలు ఎదురౌతాయి అన్నది రచయిత సత్య ప్రసాద్ గారు బాగా చెప్పారు. సమకాలీన సమస్యలను కథలుగా మలచి, వాటికి పరిష్కారాలు సూచించే విధంగా ఉన్న మీ రచనలు చాలా చదివాను.అన్నీ బాగున్నాయి.అభినందనలు.