నా పేరు బుషమైన పావని. నేను తెలంగాణ ఆదర్శ పాఠశాల,లింగాల గణపురం లో 9వ.తరగతి చదువుతున్నాను.నేను ఈ సంవత్సరం వేసవి సెలవులలో యాదాద్రి,స్వర్ణ గిరి,సురేంద్రపురి ఆలయాలను దర్శించాను. మా కుటుంబం, బంధువులతో ఉదయం ఎనిమిది గంటలకి మా ఊరి నుండి బయలుదేరాము. ముందు సురేంద్రపురికి వెళ్లినాము. ఎత్తైన హనుమంతుని విగ్రహం నన్ను బాగా ఆకర్షించింది. నేను అక్కడ ఫోటోలు దిగాను.టికెట్స్ తీసుకొని మా వస్తువులన్నీ లాకర్ లో పెట్టి లోనికి ప్రవేశించాము. అక్కడున్న అద్భుతమైన శిల్పాలని చూసి నేను ఎంతో ఆశ్చర్యపోయాను. భారతదేశంలోని అన్ని దేవాలయాలలో ఉన్నటువంటి శిల్పాలను ఇక్కడ ప్రతిష్టించారు.ఇది గొప్ప ప్రయత్నం.నాకు చాలా ఆనందంగా అనిపింఉంచింది. రామాయణం, మహాభారతం,భాగవతం లోని ఘట్టాలను అక్కడ ప్రతిష్టించారు. దేవాలయాలను చూడడానికి సుమారు నాలుగు గంటల సమయం పట్టింది. ఆలయాల ప్రాంగణం నుండి బయటకు వచ్చి భోజనం చేసి స్వర్ణ గిరి వెళ్ళాము.అక్కడ వెంకటేశ్వర స్వామిని చూడగానే నాకు తిరుమలలో ఉన్న స్వామి లాగా కనిపించాడు. స్వామిని చూడగానే ఆనందంతో నా కళ్ళ నుండి కన్నీళ్లు వచ్చాయి. అవి ఆనందభాష్పాలు అనుకుంటా.సాయంత్రం వేళ స్వామిని రథంలో గుడి చుట్టూ తిప్పారు.అప్పుడు మేము కూడా ఆ రథాన్ని లాగాము.అలా చేయడం నాకు చాలా ఆనందంగా అనిపించింది.ఆ తర్వాత మేము యాదాద్రికి వెళ్ళాము.ఆరోజు చాలామంది భక్తులు యాదాద్రికి నరసింహస్వామి దర్శనానికి వచ్చారు.మేము భక్తితో స్వామివారిని దర్శించుచున్నాము.దర్శనం తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకుని ఆ రోజు రాత్రి అక్కడే నిద్రపోయి మరునాడు తెల్లవారుజామున మా ఊరికి బయలుదేరాము.ఈ తీర్థయాత్రలు నాకు ఎన్నో మధుర జ్ఞాపకాలను అందించినాయి.
నా వేసవి జ్ఞాపకాలు:- బుషమైన పావని-9వ.తరగతి-తెలంగాణ ఆదర్శ పాఠశాల లింగాల ఘణపురం-జనగామ జిల్లా
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి