హరివిల్లు రచనలు కాసుల ధీరాజ శర్మ, హైదరాబాద్,9440522864.

 హరివిల్లు 376
🦚🦚🦚🦚
నామమాత్రంగా
చేతులు కలపడం మాను..!
పనిగా కనిపెట్టుకొని
గోతులు తీయడం మాను...!!
🦚🦚🦚🦚
హరివిల్లు 377
🦚🦚🦚🦚 
మాతృదినోత్సవమనుచు
మహార్భాటములు యేల....!
విద్యుక్త ధర్మం మంచి
ఊకదంపుడు పనులేల.....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 378
🦚🦚🦚🦚
తీసుకోవడము తప్ప
ఇవ్వని వారిది క్షయం..!
ఇస్తే తిరిగి వృద్ధియై
వచ్చేది అక్షయం.........!!
🦚🦚🦚🦚
హరివిల్లు 379
🦚🦚🦚🦚 
ఆకుకొనలనుండి
నేలరాలు జల చుక్కలు..!
సూర్య కిరణాలు పడిన
భాసించు నవ ముత్యాలు..!!
🦚🦚🦚🦚
హరివిల్లు 380
🦚🦚🦚🦚 
శబ్ద శక్తిపై కుదరని
నమ్మిక ! అబద్ధపు దారి...!
మనసా వాచా నమ్మి
పలికినచో సత్య దారి......!!
                     (ఇంకా ఉన్నాయి)

కామెంట్‌లు