జీవన సార్ధకత.;- డా పివిఎల్ సుబ్బారావు 94410 58797.
121.
మేఘం చూడు, కూడబెట్టిన, నీరు వర్షించి తరిస్తోంది!

వనం పిలిచి, పూలనవ్వుల, పలకరించి పరవశిస్తోంది! 

అంతరంగం విను, ప్రేమగా, ఎంతగానో మందలిస్తోంది! 

మానవత్వం నిలబెట్టమని, లాలిస్తూ, ప్రబోధిస్తోంది !

కాలం సాగిపోతూ ,ఒక, అడుగు, ఆగి ఆశీర్వదిస్తోంది!

122.
ప్రపంచాన అసురులే కాదు, సురులూ ఉన్నారు! 

భారతాన కౌరవులతోపాటు, పాండవులూ ఉన్నారు !

ఇక్కడ  గంజాయి వనాలేనా, తులసి మొక్కలూ ఉన్నాయి!

 లెక్క తక్కువైనా, నిక్కచ్చి , మానవులూ ఉన్నారు!

 దురాత్ములెందరున్నా ,
ఒక మహాత్ముడూ ఉన్నాడు!

123.
తులసీదాస్ ,కబీర్ దాస్ ,
సూరదాస్!
 
తుకారాం, శిరిడి సాయి, మీరాబాయి !

ఇలా ఎందరో కారణజన్ములు,
అవతరించిన ఘనులు!
 
దైవ ప్రతినిధులు,
          నిజ జ్ఞాననిధులు!

 వారి బోధనలు పూర్తిగా విను ,
చూపిన జాడ వీడక నడు!
_________
రేపు కొనసాగుతుంది.


కామెంట్‌లు