పతివ్రతల దేశం;- ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 అకార ద్వయంలో  మకారద్వయం రేణుకా దేవి  అలాంటి అమ్మ ప్రపంచానికి ఆదర్శప్రాయమై నిలిచినప్పుడు  నీకు అతి సమీపంలో ఉన్న  ఆమె  విశిష్టత నీకు అర్థం కాలేదు  ఎంతమంది పతివ్రతలు ఈ భారత దేశంలో  ఇతర దేశస్తుల మన్నలను  పొందిన వారు ఉన్నారు. అందుకే కవులు  సీతమ్మ వారి పేరుతో  ప్రతి స్త్రీ సీలవతి మానవతి  అని ప్రస్తుతించారు. క్షమకు మారుపేరు  జ్ఞానానికి  మేరు పర్వతం  ఒక్కొక్క పతివ్రత  ఒక్కొక్క నీతిని ఈ ప్రపంచానికి చెప్పి  సెలవు  తీసుకున్నదే  అలాంటి ఉన్నత  పవిత్రత కలిగిన  ఆమె కు దేశంలో ఇచ్చే గౌరవం ఏ పాటిది  హక్కుల కోసం పోరాడకుండా బాధ్యతలను సక్రమంగా  అందరికీ ఆదర్శప్రాయంగా ఉండేలా  ప్రవర్తించిన  లలనా మణులు గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఋషి పుంగవులు ఎవరు ఏ కావ్యాన్ని నిర్మించినా దానిలో  సామాజిక స్పృహతో  మానవాళి ధర్మాలను తెలియజేయడం కోసమే వారు వ్రాస్తారు  శకుంతల గురించిన కథ  వ్యాసమహర్షి వ్రాశారు  దానిని ఆధారం చేసుకుని కాళిదాసు దానిని విపులపరిచి అందమైన కథ గా తీర్చిదిద్దారు  శకుంతలను  పక్షులు కాపాడుతున్న దృశ్యాన్ని చూసి    కన్వ మహర్షి ఆ పాపను తీసుకుని తన ఆశ్రమంలో ఉంచి కన్నబిడ్డల పెంచి పోషించాడు  ఒకరోజు  ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న దుశ్యంతుడు  అడవిలో వేటాడడానికి వచ్చి  ఆశ్రమాల్లో అందమైన ఆడపడుచును చూడగానే  ఆమెను ప్రేమించి  ఆమెను  గాంధర్వ విధిని వివాహం చేసుకున్నాడు  అక్కడ వ్యాసులవారు  దైవము  పరగ  నర్స్యము అంటూ వివాహంలో ఎనిమిది రకాలను  వివరించారు.
తరువాత శకుంతల  గర్భవతి కావడం  కుమారుడు జన్మించడంతో  కన్వ మహర్షి అతనికి  భరతుడు  అంటే వెలుగు చూపేవాడు  అనే నామకరణం చేస్తాడు  కుర్రవాడు పెరుగుతున్న సందర్భంగా  ఒకరోజు శకుంతలని పిలిచి కన్వ మహర్షి  శ్రీ ధర్మాలను గురించి చెబుతారు  అది సమాజం కోసం  ఎట్టి పడతులకు  పుట్టినింట పెద్దకాలమునికి దగ్ధ తగదు అంటూ భర్త సన్నిధికి పంపడానికి  నది వరకు వెళ్లి  కుమార్తెను సాగనంతో వస్తాడు  శకుంతల  దుష్యంతుని రాజాస్థానానికి వచ్చి  తనను గురించి తెలియజేసి కుమారుని విషయం చెప్పి  ఆరోజు గాంధర్వ వివాహాన్ని గురించి తెలియజేస్తే  నాకు జ్ఞాపకం లేదు  నీవెవరో నాకు తెలియదు అంటాడు రాజు  అక్కడ ప్రపంచానికి  హితబోధ చేయాలన్న ఉద్దేశంతో వ్యాసులవారు  నాలుగు పద్యాలను చెబుతారు.


కామెంట్‌లు