అమ్మలకు అమ్మ;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

 ఈ భూమి మీద అమ్మ లేకపోతే ఏ జీవి లేదు  బిడ్డ ఆకలితెలిసి  అతని ఆకలి  తీర్చేది అమ్మే కదా  తన సొంత బిడ్డల ఆకలి తీర్చడమే కాక  ఇతరులను కూడా తన  బిడ్డలుగా భావించి ఆకటితో నకనకలాడుతున్న వారి కడుపును నింపడానికి  తల్లిలా ముందుకు వచ్చేవాడు అతి కొద్దిమంది  వారిలో అనసూయమ్మ గారు అని చెప్పబడే  జిల్లెళ్ళ మూడి అమ్మ  నాకు తెలిసి  వారి పీఠానికి వెళ్లిన ప్రతి వారిని  ముందు భోజనం చెయ్ అంటుంది  అది  అమ్మ మనసు  ఎంతో మంది వదాన్యుల  సహాయ సహకారాలతో  అనేకమంది ఆకలి తీర్చింది అమ్మ  శారీరక రుగ్మత వల్ల  భోజనం చేయలేని తన స్థితి  ఆకలికి ఎలా అలమటించినదో  తెలుసుకున్నది కనుక  అందరి ఆకలి తీర్చడానికి నడుం కట్టింది  అమ్మ. ఆ ఆశ్రమంలో ప్రత్యేకంగా ఒక విభాగం  అన్నదానము అని వ్రాసి ఉంది  అన్నం బ్రహ్మస్వరూపులమా భగవంతుడు మానవులకు  జీవి జీవించడానికి ఏర్పాటుచేసిన అమృతం  ఆ దేవుడు మనకు దానం చేశాడు  మరి మనం కూడా దేవుళ్ళమా  భగవంతుని స్వరూపలమా  కాదు కదా మరి ఆ శబ్దం వాడవచ్చునా  భగవంతునికి ఇచ్చిన  ఏ పదార్థాలు అయినా ఇతరులకు ఇచ్చేటప్పుడు ప్రసాదంగా స్వీకరించమని కోరుతాం తప్ప  దానంగా తీసుకో అని అనగలమా  అన్న ప్రసాదం అన్న శబ్దం లో ఉన్న అర్థం  ప్రసాదంగా స్వీకరించిన వారికి కలిగే తృప్తి  దానం వల్ల కలుగుతున్నదా లాంటి దాన ప్రక్రియ  అలాంటి  శబ్దాలను ప్రక్కన పెట్టి  ఎవరు ఆకలితో వచ్చి అమ్మా అని అడిగితే  వారి ఆకలి తీర్చేది అమ్మ. అలాంటి అమ్మలు ఎంతమంది ఉన్నారు  అడగగానే ఇంట్లో పీట వేసి కూర్చోబెట్టి  తనకు ఉన్న దాంట్లో  ఆనందకరమైన మనసుతో ఆరగించవయ్యా  అనే ఆడ కూతురిని  మనం చూడగలమా ఈ భూమి మీద  అనుకున్నప్పుడు  మన మస్తిష్కానికి  జ్ఞాపకం వచ్చే  ఒకే ఒక పేరు కనకమ్మ  తల్లిదండ్రులు  ఆమెకు ఆ నామకరణం ఎందుకు ఎలా చేశారో తెలియదు కానీ  ప్రజల అందరి చేత బంగారు తల్లి అని  కొనియాడబడే కనకమ్మ గారు  ధన్యజీవి. ఇంట్లో అన్నం లేకపోయినా అతిథిని అలా కూర్చోబెట్టి  అప్పటికప్పుడు వేడి పదార్థాలను చేసి  కన్న బిడ్డకు పెట్టిన  ఆప్యాయతతో  వడ్డన చేయడం ఆమె కుమాత్రమే తగినది  అందుకే ఆమె  భౌతికంగా మనలను వీడి  స్వర్గ లోకంలో  ఇంద్రాది దేవతలను కూడా  మెప్పించేలా  వారి ఆకలి  తీరుస్తూ ఉండి ఉంటుంది  అలాంటి గొప్ప తల్లి  పేరు స్మరిస్తే చాలు  పుణ్యలోకాలు వస్తాయి  మనసు మారి  మగవారికి కూడా అమ్మ మనసు ప్రాప్తిస్తుంది.

కామెంట్‌లు