మానవ జీవితం ఎంతో విచిత్రమైనది ఏ క్షణాన ఏం జరుగుతుందో తనకి తెలియని స్థితిలో అతని జీవితం కొనసాగుతూ ఉంటుంది బ్రహ్మ రాసిన రాత అని మన పెద్దలు ఎప్పుడో ఒకసారి చెప్పిన మాటను ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకుంటూ దానినే ప్రచారం చేస్తూ ఉంటారు నిజానికి అందరికీ ఒకే రాత రాస్తాడు కదా బ్రహ్మ అతి పిన్న వయసులోనే ఎందుకు మరణిస్తున్నారు ముసలి తనం వచ్చినా మంచం మీదే కాలక్షేపం చేస్తూ నరకాన్ని అనుభవించే వ్యక్తులు అలా ఎంతకాలం బాధను అనుభవిస్తూ ఉంటారో మనం చూస్తూనే ఉన్నాం బ్రహ్మ రాతలో ఉన్న లోపమా నీ జీవన విధానాల్లో చేతులారా చేసుకున్న దోషాలకు పరిహారమా శంకరాచార్యుల వంటి వారు కూడా జాతస్యహి తృవో మృత్యువు అని చెప్పారు మాటలు వేరు చేతలు వేరు. మిడిమిడి జ్ఞానంతో ఇది నా జీవితం నా ఇష్టం నాకు ఏ పద్ధతిలో జీవించాలని అనుకుంటే ఆ పద్ధతిలోనే నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తాను తప్ప మరెవరో చెప్పిన దానిని ఆచరించను అని మొండిగా వ్యవహరించడం గమనించవచ్చు ఎలాంటి పని చేస్తే మంచి పేరు గడించవచ్చును చెడ్డ పేరు ఎందుకు వస్తుంది అన్న ఆలోచన అతని మనసుకు తట్టదు సంపాదన మీద ఆసక్తి కలిగిన వారు జీవితంలో అన్ని సుఖాలకు ఈ ధనమే మూలం అంటూ తనకు మించిన ఎన్నో మార్గాల ద్వారా ధనాన్ని సంపాదిస్తూ ఉంటాడు దానిని సత్కార్యాల కోసం వినియోగిస్తాడా సమాజానికి సహాయ పడే పని చేయిస్తాడా అంటే అతనికి ఆ ఆలోచన రాదు అన్న సమాధానం వస్తుంది మనకు అలాంటి వారి జీవితం ఎలా ముగుస్తుందో చెప్తున్నాడు వేమన. ఎప్పుడు ధనం తన చేతికి వచ్చిందో బెల్లాన్ని ముసురుకున్న ఈగల వలె భట్రాజులు ప్రతినిత్యం ఇతనిని పొగిడే వ్యక్తులు చుట్టూ చేరతారు అలాంటి వారిలో ఏ ఒక్కరైనా మంచి పనులు చేయమని చెప్పే వ్యక్తులు ఉంటారా అంటే అలాంటి మనస్తత్వం కలిగిన వాడికి ఇలాంటి స్నేహితుడు ఎలా దొరుకుతారు మంచివాడు చుట్టూ మంచివాడు చెడ్డవాడి చుట్టూ చెడ్డవాడు చేరతారని సామెత తను చేసే పనుల వల్ల వీరి మాటల వల్ల ఎంతో అపకీర్తిని మూట కట్టుకుంటాడు జీవితంలో ఎలాంటి తోడు నీడ లేకుండా పోతుంది దేని వల్ల అతను విరవిగుతున్నాడో ఆ గర్వం మాత్రం అతనిని వదలదు అని చెబుతున్నాడు వేమన వారు రాసిన ఆ పద్యాన్ని చదవండి మనకు అసలు విషయం తెలుస్తుంది.
"ఎవ్వరెరుగకుండ నెప్పుడు పోవునో పోవు జీవమట్లు బొంది విడిచి యంత మాత్రమునకు నపకీర్తి నెరుగక విరగబడును నరుడు వెర్రి వేమ..."
"ఎవ్వరెరుగకుండ నెప్పుడు పోవునో పోవు జీవమట్లు బొంది విడిచి యంత మాత్రమునకు నపకీర్తి నెరుగక విరగబడును నరుడు వెర్రి వేమ..."
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి