ఒక సందర్భంలో అనకాపల్లి లో కొంతమంది విద్యావేత్తలు ఒకసభను ఏర్పాటు చేసి దానిలో వక్తలుగా గోరా గారిని జాషువా గారిని పిలిచారు సామాజిక స్పృహతో వేదికపై ఉన్న ప్రతి ఒక్కరూ మాట్లాడారు జాషువా గారు కూడా మాట్లాడిన తర్వాత గోరా గారు మాట్లాడుతూ జాతి మత కుల విచక్షణ లేకుండా సమాజం సుభిక్షంగా ఉండాలనుకుంటే కులాంతర మతాంతర వివాహాలు జరిగే తీరాలి అని చెప్పగానే ప్రేక్షకులలో ఒక వ్యక్తి లేచి మీరు బ్రాహ్మణులు కదా ఇతర కులాలలో ఉన్న వారిని చేసుకోవడానికి సిద్ధమేనా అని అడిగాడు నా పిల్లలకు ఎవరికి నా కులం వ్యక్తిని ఎంచుకొని వివాహం చేయలేదు నేను ఏది చెబుతూ ఉంటానో దానిని చేయడానికి ప్రయత్నం చేస్తాను నా పిల్లలు కూడా ఆ పద్ధతిలోనే పెరిగారు అని చెప్పగానే. ప్రేక్షకులలో మరొకతను లేచి మీ పిల్లవాడు వివాహానికి సిద్ధంగా ఉన్నాడు కదా జాషువా గారి కులం ఏమిటో మీకు తెలుసు వారి అమ్మాయిని మీ కోడలుగా చేసుకోవడానికి ఏవైనా అభ్యంతరం ఉందా అని అడిగాడు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఈ క్షణానే ఆ వివాహం చేయడానికి నేను సిద్ధం అయితే జాషువా గారు దానికి అంగీకరించాలి అనగానే జాషువా గారు మా అమ్మాయి ఎంఏ చదివింది మీ అబ్బాయి మెట్రిక్యూలేషన్ కనుక చేసుకునేది అమ్మాయి కనుక ఆమెను కనుక్కొని ఆమె అంగీకారం తీసుకొని మీకు మాట ఇస్తాను అని చెప్పగానే ప్రేక్షకులంతా కరతాళ ధ్వనులతో జయ జయ ద్వానాలు పలికారు తరువాత లవణం గారికి హేమలత గారిని ఇచ్చి వివాహం చేశారు దానితో వియ్యంకులయ్యారు.
వినోబాజీ ఆంధ్ర పర్యటన చేసినప్పుడు వారి హిందీ ఉపన్యాసాన్ని లవణం గారు అనువదించి చెప్పేవారు వేదికల పైన హేమలత లవణం అన్న పేరుతో జాషువా గారి అమ్మాయి గోరా గారి ఆశయాలకు ఆదర్శంగా నిలబడి తన భర్తతో పాటు అనేక కార్యక్రమాలలో పాల్గొని ఇలాంటి వాటిలోఉద్యమంగా స్త్రీలు ముందుకు వచ్చి పాల్గొన్నప్పుడు మాత్రమే విజయవంతం అవుతుంది అంటూ స్త్రీలను ప్రోత్సహించేవారు అనేక హిందీ రచనలను తెలుగులో అనువదించి ప్రచురించారు కూడా గోరా గారి భార్య సరస్వతి గారు నా కన్నా నా కోడలు గొప్పగా మాట్లాడగలుగుతున్నది స్త్రీలకు ఏది అవసరమో దాని గురించి తెలియజేస్తూ వారిలో ఉత్సాహాన్ని నింపుతుంది అంటూ అభినందించారు కూడా.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి