నిక్కమైన నిజం కావాలి- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

 మనం రోజు సమాజంలో ఉన్న అనేక మందితో  పరిచయాలు పెంచుకుని మాట్లాడుకుంటూ ఉంటాం  ఆ సమయంలో అవతలవారు కొన్ని విషయాలను  చెబుతూ ఇది నిత్య సత్యం అంటారు  ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోవలసిన  దాని అసలు అర్థం తెలియకపోతే  దానికోసం తపన పడుతూ ఉంటాడు  ఈ మాటలు ఎలా వ్యాప్తి చెందుతాయో ప్రయోగాత్మకంగా కొంతమంది  శాస్త్రజ్ఞులు ఒక సమయంలో  పదిమందిని పిలిచి  ఒక్కొక్కరిని ఒక్కొక్క స్థానంలో ఉంచి  మొదటి వ్యక్తికి ఒక వాక్యం చెపితే  రెండో వాడికి మూడో వాడికి అలా చెప్పుకుంటూ వెళ్లి చివరి 10వ వాడికి చెప్పినప్పుడు  మొదట ఏ వాక్యమైతే ఈ శాస్త్రజ్ఞుడు చెప్పాడో దానికి వ్యతిరేక అర్థం వచ్చే  వాక్యాన్ని ఆ చివరివాడు  చెప్పడాన్ని గమనించారు. సహజంగా మన స్నేహితులలో  ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో  వారి మాటల తీరు ఉంటుంది. హాస్యంగా చెప్పే పద్ధతి వేరు నిజాన్ని తెలుసుకుని దానిని చెప్పే పద్ధతి వేరు  కల్లబొల్లి కబుర్లు చెప్పే వ్యక్తులు  మన కళ్ళముందే ఉన్న  వారి మాటల గారడీతో  మనలను నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉంటారు  అది నిజమా కాదా అని తెలుసుకోవాలి అన్న ప్రయత్నం  ఇతను చేయడు  ఒకవేళ ప్రయత్నించిన దానికి సరైన సమాధానం చెప్పగలిగిన వ్యక్తి అతనికి దొరకాలి  ఆ దొరికిన వ్యక్తికి సమాచారం లో ఉన్న లోతుపాతులు తెరిచి ఉండాలి  నీకు తెలిసిన నిజం ఏమిటో  తెలిసి  చెప్పినట్లయితే దానికి  ఆధారాలను కూడా చూయించి  రుజువు చేయగలిగినట్లయితే  ఆ మాటలను నమ్మడానికి అవకాశం ఉంటుంది  నమ్మాలి కూడా తనకు వచ్చిన అనుమానాలను తెలిసిన వారి దగ్గర  అడిగి తెలుసుకుని  దానిని నమ్మినవాడు నిత్యుడు  కావడం మంచిది  మాటల మాధుర్యాన్ని భద్రపరచుకుంటూ  ఆ మాటలలోనే పదార్థం ఏమిటి  అతను బోధించిన వాక్యాలలో ఉన్న మర్మం  ఏమిటి  అని తాను కూడా ఆలోచించి  దానికి అనుగుణంగాను వ్యతిరేకంగానూ రెండు పద్ధతులను  ఉదాహరణలతో పాటుగా  ఆలోచించి ఏది నిజమైనదో ఏది శాశ్వతమైనదో  అలాంటి పదార్థ బోధక వాక్యాలను  మనసులో భద్రపరుచుకుంటూ  తాను నమ్మినదే కనక అనుసరిస్తూ  జీవితాన్ని సుఖవంతం చేసుకోవాలి తప్ప  మిగిలిన మాటల జోలికి వెళ్ళకూడదు అని చెబుతున్నాడు వేమన వారు రాసిన పద్యాన్ని ఒక్కసారి చదవండి.

"నిజము  యేల నెరిగి నిత్యుండు గాడాయె  పలుకులోని బిందు పదిల పరచి వేడుకైన బిందు వెదబెట్టకుందురా..."

కామెంట్‌లు