సుభద్ర;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 చామకూర వెంకట కవి గారు  విజయ విలాసము అంటూ అద్భుతమైన కావ్యాన్ని మనకు అందించారు  దానిలో ప్రతిపద్యంలో  ఒక సొగసు కనిపిస్తుంది  అక్షరాలతో ఆడడం అంటే  వారికి సరదా  ఎన్ని ఉదాహరణలైన చూయించవచ్చు  చామకూర  పాకాన పడింది అనే వారి రచనలు గురించి ప్రశంసించిన  గొప్ప గొప్ప విద్యావంతులు  ఉన్నారు  అయితే ఆయన బ్రాహ్మనేతరుడు  కనుక బ్రాహ్మణులకు అతని కవిత నచ్చదు అనడానికి  అద్భుతమైన ఉదాహరణ  మద్రాసులో ఉన్న గొప్ప కవి  ఒక చిన్న మాటతో  విజయ విలాసము అన్న కావ్యం శూద్ర విరచితమైనది  అన్న విషయం  వారు మరణించిన తరువాత  చదివిన తాతాజీ గారు  విజయ విలాస కావ్యానికి దాదాపు 350 పేజీల  వ్యాఖ్యానం రాసి  వారి మనమని దగ్గరికి వెళ్లి  వినిపించాడు. ఏమయ్యా మీ తాతగారు మా తాత గారిని దూషించారు  ఒక కవిగా  కవితలో ఉన్న సొగసులను ఆస్వాదించాలితప్ప రంధ్ర అన్వేషణ  చేయడం పెద్దలకు తగునా  అని మీ తాతగారు విమర్శించినది  మామకు మేనమామకు భేదం తెలియని శూద్ర కవి విరచితము అని  అది అర్థం చేసుకోవడం కూడా తెలియని కవిగా దేశంలో గొప్ప పేరు సంపాదించుకున్న మీ  తాత  ఎంత కుసంస్కరిగా  ప్రవర్తించాడో చూడు  మామ కాగమన వార్త తెలియచేయి అన్న దానిని మామ దగ్గర ఆపి  విమర్శించిన మహానుభావుడు  తరువాత కాగ అని ఉన్న శబ్దాన్ని వదిలివేయడం  అతని మస్తిష్కం పనిచేయకపోవడం  అని నేను అనుకుంటున్నాను  ఇప్పటివరకు అతను నాకు మేనమామ  నేను నిన్ను వివాహమాడితే ఆయన నాకు మామ కదా  అన్నారు అతని తెలియకపోతే  విమర్శకు ఏమైనా అర్థం ఉన్నదా  అని చెప్పి వచ్చిన జ్ఞాని  తాతాజీ అనబడే తాపీ ధర్మారావు గారు ఒక ఇంట్లో ఒక ఆడపిల్ల వివాహం  నిశ్చయం అయిన తరువాత  ఆ ఇంటిలో ఉన్న ఆమె ఆడపడుచులు అందరూ ఎంత ఆనందిస్తారో తెలియజేస్తూ  వెంకట కవి గారు చేసిన చమత్కారం  మన సుభద్ర పెళ్లి కూతురాయె  మనసు భద్రమయ్యే మనకు నెల్ల మొదట సుభద్ర మనది  అన్న అర్థంలో చెబుతూ  ఆమె పెళ్లికూతురు కావడం మనందరికీ ఆనందదాయకం కదా దానివల్ల ఫలితం ఏమిటి  మన అందరకు కూడా  మనసు చాలా హాయిగా ఉంటుంది  అన్న అర్ధంలో మన శబ్దానికి సుభద్ర లో ఉన్న సును కలిపి  మనసు అన్న తర్వాత  భద్రమయ్యె అన్న చమత్కారం  చామకూరి వాడు తప్ప మరొకరు చేయగలరా. వేదం వెంకట్రాయ శర్మ గారికి  ఇవేమీ తెలియవు అని మనకు తెలుస్తుంది  కుల భేదాలతో చెప్పిన మాటలు  సాహిత్యానికి  విమర్శలకు తగని శబ్దాలు.

కామెంట్‌లు