శివనాగి రెడ్డి గారు అనేక శాసనాలను చదివి వాటి చిత్రాలను భద్రపరచి శిల్పాలను చూసి వాటిని కూడా తన కెమెరాలో బంధించి అద్భుతమైన చరిత్రను ఎలాంటి కల్పితాలు ఊహాజనితాలు లేకుండా అనేక గ్రంథాలను మన ముందు ఉంచి ఆ శాస్త్రం తెలిసిన పెద్దలతో కూడా వారు పైకి చెప్పకపోయినా అద్భుతమైన అన్వేషణ అని ఆనందించిన వారే ప్రతి సామాన్యులకు కూడా తన పుస్తకం అందుబాటులో ఉండాలని తనకు తెలిసిన భాషలు కాకుండా ప్రజలకు అర్థమయ్యే జన భాషలో గ్రంథస్తం చేసి మన ముందు ఉంచారు దానిలో మనకు తెలియని అనేక విషయాలు మనం భ్రమలతో ఆలోచించే సంఘటనలను తెలియజేస్తూ రాసిన గ్రౌండ్ నుంచి ఒక్కొక్క విషయాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి మన కోరికలను తీర్చుకుందాం. శివ నాగిరెడ్డి గారు ఇంత క్రితం తన పరిశోధనలో వెలువరించిన ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక పత్రికలో ప్రచురణ కోసం పంపుతూ ఉంటారు అలా ప్రాచుర్యం పొందిన కోళ్లూరు యాత్ర నుంచి నంది వెలుగు యాత్ర వరకు 20 వ్యాసాలను ఎంతో శ్రమకు ఓర్చి తెలుసుకున్న విషయాలను మన ముందుకు పుస్తక రూపంలో తీసుకురావడం ముదావహం మనకున్న అనేక అనుమానాలను తుదముట్టించే చక్కటి వ్యాసాలు ఈ పుస్తకానికి చక్కటి రంగులను అద్ది శివ నాగిరెడ్డి గారి కృషిని చదువురులకు తెలియజేస్తూ మోదుగుల రవికృష్ణ గారు మనకు అందించారు శివ నాగిరెడ్డి గారి కృషిని కళ్ళకు కట్టినట్టుగా వాచ్యంలో చెప్పినా దృశ్యంగానే మన ముందుకు వచ్చింది.
రవి కృష్ణ గారికి అభినందనలు తెలియజేస్తూ విషయంలోకి వెళదాం ప్రపంచ పటంలో భారతదేశపు ఔన్నత్యాన్ని ఐశ్వర్యాన్ని నాగరికతను సంస్కృతిని తెలియజేసిన వజ్రం కోహినూరు వజ్రం దానిని గురించి మనకి అనేక రకాలైన అనుమానాలు అది ఎక్కడ దొరికింది ఎలా దొరికింది ఆ స్థలంలో ఎందుకు ఉంది ఇలాంటి వాటన్నిటికీ సమాధానాలా అన్నట్లుగా ఈ వ్యాసాలు మన ముందు ప్రత్యక్షమైనాయి. ఈ కోహినూరు ఏ ప్రాంతంలో మనకు దొరికిందో తెలుసుకుందాం. కృష్ణాతీరంలో గుంటూరు జిల్లాలోని ఒక గ్రామంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కోహినూర్ వజ్రం దొరికిందని ఆ ఊరు కోల్లూరు ప్రచారమైంది అందరూ పాత గుంటూరు జిల్లాలోని మండల కేంద్రమైన కొల్లూరు అని అనుకుంటారు కానీ నేటి పల్నాడు జిల్లా గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలంలోని కోళ్ళూరులో ఈ కోహినూర్ వజ్రం మనకు దొరికింది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి