మల్లెల వేళ....- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.చెన్నయ్ .-9884429899.

 ఎండకు ఎండనివారు, వానలో తడవనివారు, వేకువ మంచులో నడవని వారు, మల్లెల సుగంధాన్ని ఆస్వాదించనివారు ఉండరు గాక ఉండరు.తెల్ల చీర కట్టుకున్నది ఎవరికోసము,మల్లెపూలు పెట్టుకున్నది ఎవరికోసము, అన్నాడో సినీకవి.
మల్లెవిరిసింది పరిమళపు జల్లు కురిసింది. అని మరో సినీ కవి అటే, మల్లెపూలు గోల్లుమన్నవి ' అని ఇంకో సినీ కవి అన్నారు.
ఇహ ' పుష్ప విలాపం ' రాసి ఘంటసాల గారిచే పాడించిన మనకు కన్నిళ్ళే తెప్పించారు కరుణశ్రీగారు . వెన్నెలకు మల్లెలకు అవినాభావ సంబంధం మనందరకు తెలిసిందే. దేవుడే తను మల్లి కార్జునుడుగా వెలసాడు. అలా పూలలో ప్రధమ స్ధానంలోఉన్న మల్లె పూలు వివరం తెలుసుకుందాం!
పూజకేకాదు అలంకరణలోనూ అగ్రస్ధానమే. స్త్రీలు మాత్రమే సిగ అలంకారానికి వాడుకుంటారు.చేమకూర వెంటకవి తన ' విజయ విలాసం '  కావ్యనాయకుడు తనసిగలో సంపెంగె పువ్వు ధరించాడని వర్ణించాడు. నేటికి మనం దేవాలయానికి వెళితే పూజారి పువ్వు మగవారంతా చెవిలో పెట్టుకోవడం మనకు తెలిసిందే.ఇదిమన సంస్కృతిలోభాగం.
పూలలో అగ్రస్ధాం మల్లెలదే మల్లెపూవు ' ఓలియేసి ' జాతికి చెందినది. భారత్ ,చైనా,బర్మా,ఆస్ట్రేలియా,ఆగ్నేయ యూరప్ దేశాలు దీని నెలవు. తీగలా పొదలా పెరిగే ఈమల్లెపూలలో రెండు వందల రకాలకు పైగా ఉన్నాయి. ' అఫీసినేల్ ' అనే రకం ఉత్తర భారతదేశం, చైనా,పర్షియాలో మామూలు మల్లెగా పేరు. ' గ్రాండిఫ్లోరం ' అనేరకాన్ని ' రాయల్ ' 
' స్పానీష్ ' ' కాటాలోనియన్ జాస్మిన్ ' అని, హిందీలో ' ఛమేలి ' అని ,బెంగాలిలో ' జాంతి ' అని అంటారు. ఈజాతి మల్లెలు అత్తరు తయారికి ఎంతో మేలైనవి.
' సాంబక్ '..ఇదిభారతదేశపు అరేబియన్ మల్లె. ముద్దలుగా పూసే ఈమల్లెలను ఉత్తర భారతాన ' మోతియా ' లేక ' మోగ్రా ' అంటారు .వీటినే దక్షణ భారతాన ' దొంతర మల్లెలు ' చిన్న ముద్దు పువ్వులు ' గుండు మల్లె ' పెద్ద ముద్ద పువ్వుల ' బొండుమల్లె ' ( దీనినే టాస్కన్ లేక గ్రాండ్ డ్యూక్ ఆఫ్ టస్కనీ అంటారు) పశ్చమ బంగాళాఖాతంలో వీటిని ' భేలా  ' ,' భోయా ', ' మోతూరియా ' (అరముద్ద), ' రాయ్ ' ( పెద్దముద్ద ) ' మదన్ బాన్ ' అంటారు .
' అరికులేటం ' అనేరకాన్ని ' డోయి ' లేక ' విరజాజి ' అని అంటారు.
' ప్రిమ్యులైనం '...ఇది చైనా దేశపు పొదరిల్లు చలికాలపు మల్లె.దీనికి వాసన లేదు.' హ్యుమిలి ' దీన్ని ఇటాలియన్ మల్లె అని స్వరఛమేలి
 ( స్వర్ణమల్లె) ఇది ఆసియాలోని ఉష్ణ మండలాల్లోనూ,ఆగ్నేయ యూరప్ లోకూడా ఏడురేకులతో పచ్చగా సున్నిత వాసనకలిగి ఉంటుంది. ' అంగుష్టిఫోలియం ' .. దీన్ని మాలిక,మల్లిక అంటారు.సువాసనకలిగిన పొదరింటి రకం ఇది.
' ఫ్లోరిడం ' ఇది చైనా దేశానికి చెందినది. దీన్ని ' స్వర్ణజోయా ' (స్వర్ణజాజి)
అనిఅంటారు. ' హ్యబెసెన్స్ ' అనేరకం భారత , చైనాలకు చెందినది.దీనిని బెంగాల్లో ' కుంద్ ' (కుంద) అంటారు.' ఆర్బోరిసెన్స్ ' దీన్ని నవమల్లిక అంటారు.' పానికులేటరి ' దీన్ని చీనా జాజి అంటారు.తెల్లరంగు వాసన కలిగిన పూలు తీగకు పూస్తాయి.
మనం మల్లెపూలను ' బోడ్డుమల్లె ' ' పందిరిమల్లె ' ' జాజామల్లె ' ' తుప్పుమల్లె ' ' జూకామూల్లె ' ' నాగమల్లె '(శివలింగపువ్వు) అని పిలుస్తాం.ఈమల్లెలన్ని సువాసనతో తెల్లగా ఉంటే, జూకామల్లె నీలం గాజులా ఉంటుంది.కొన్నిప్రాంతలలో ఈపువ్వును కౌరవ పాండువుల పువ్వుఅంటారు.ఈపువ్వుచుట్టు సన్ననిరేకులు నూరు ఉంటాయి. దీనిలోపల దళసరంగా పాండవుల్లా ఐదురేఖలు ఉంటాయి.ఈఅయిదు రేఖలమధ్రన బొడ్డులా ఒకటి ఉంటుంది.దాన్ని ద్రౌపతి అంటారు.
మల్లిక అనేపువ్వు పొదల ప్రజాతికి చెందిన, ఆలివ్ కుటుంబానికి (ఒలకేసి) చెందిన తీగలా పెరిగి సువాసనలిచ్చే పూలు పూసే మొక్క. ఉష్ణమండల, వెచ్చని ఉష్ణోగ్రతలు కలిగిన యూరేషియా, ఆస్ట్రేలియా, ఓసియానియా ప్రాంతాలలో పెరిగే సుమారు 200 జాతులు వున్నాయి. వేసవి రాగానే మల్లి మొగ్గల వాసన గుప్పు మంటుంది. ఇదే కుటుంబానికి చెందిన జాజి పూలు కూడా సువాసననిస్తాయి.
ఈ మొక్క ఆకురార్చే మొక్కగాగానీ (శరదృతువులో) లేదా పచ్చగా గానీ (సంవత్సరమంతా) నిలువుగా ద్రాక్ష తీగల వలెనే పైకి ప్రాకి వ్యాపించి ఉంటుంది. దీని పుష్పాలు సుమారు 2.5 సెం.మీ (0.93 అంగుళాలు) వ్యాసాన్ని కలిగి ఉంటాయి. ఇవి పసువు లేదా తెలుపు రంగులతో ఉంటాయి. కొన్ని పరిస్తితులలో అవి కొంచెం ఎరుపు రంగులో కూడా ఉంటాయి. ఈ పువ్వులు సైమోజ్ క్లస్టర్లలో మూడుపువ్వులుగా వ్యాపించి పుంటాయి. ప్రతీ పువ్వు సుమారు నాలుగు నుండి తొమ్మిది రేకులను కలిగి ఉంటుంది. మల్లెల్లో నలభై రకాలవరకు ఉంటాయి. అయితే మన రాష్ట్రంలో అధికంగా పందిరిమల్లె, తుప్పమల్లె, జాజిమల్లి, కాగడామల్లె, నిత్యమల్లెవంటివాటిని విరివిగా సాగుచేస్తుంటారు.
మల్లెలు మాఘ మాసంలో పూయటం మొదలుపెడతాయి. అందుకని వీటిని ‘మాఘ్యం’ అంటారు.
ప్రపంచవ్యాప్తంగా మల్లెల జాతులు చాలా ఉన్నప్పటికీ మనకు తెలిసిన మల్లె జాతి మాత్రం జాస్మినమ్‌ సంబక్‌ మాత్రమే. దీన్నే అరేబియన్‌ జాస్మిన్‌, మల్లిక, కుండమల్లిగై, మోగ్రా... ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తారు. పూలరేకులూ పరిమాణాన్ని బట్టి ఇందులోనూ రకాలున్నాయి. ఒకే వరుసలో ఐదు లేదా అంతకన్నా ఎక్కువ రేకలతో ఉండేదే మెయిడ్‌ ఆఫ్‌ ఓర్లియాన్స్‌. వీటినే రేక మల్లె, గుండు మల్లె అంటారు. గుండుమల్లెలానే ఉంటాయికానీ వాటికన్నా కాస్త బొద్దుగా ముద్దుగా ఉండేవే అరేబియన్‌ నైట్స్. కాడ సన్నగా ఉండి గుండ్రని మొగ్గల్లా ఉండే బొడ్డు మల్లెల్నే బెల్లె ఆఫ్‌ ఇండియాగా పిలుస్తారు. వీటినే మైసూర్‌ మల్లెలనీ అంటారు. ఎండ తగులుతుంటే ఏడాది పొడవునా పూస్తుంటాయి. వీటిల్లోనే మరోరకం సన్నని పొడవాటి రేకలతో ఉంటుంది. దీన్ని బెల్లె ఆఫ్‌ ఇండియా ఎలాంగేటా అంటారు. చూడ్డానికి చిట్టి గులాబీల్లా ముద్దగా ఉండే రోజ్‌ జాస్మిన్‌ లేదా సెంటుమల్లె అనేది మరోరకం. ఇందులో రెండు రకాలు. గ్రాండ్‌ డ్యూక్‌ ఆఫ్‌ టస్కనీ, గ్రాండ్‌ డ్యూక్‌ ఆఫ్‌ సుప్రీమ్‌. పొడవాటి పొదగా పెరిగే ఈ రకాల్లో ఒకేచెట్టుకి ఒకే సమయంలో రకరకాల పరిమాణాల్లో పూలు పూస్తాయి. ఈ పూలు ఒక్కరోజుకే రాలిపోకుండా కొన్నిరోజులపాటు చెట్టుకే ఉండి సుగంధాలు వెదజల్లుతాయి. దొంతరమల్లె అనే మరో రకం ఉంది. ఇందులో పూరేకులు అరలు అరలుగా అమరి ఉంటాయి. మాఘమాసంలో ఎక్కువగా పూసేదే జాస్మినమ్‌ మల్టీఫ్లోరమ్‌. మాఘ మల్లిక, స్టార్‌ జాస్మిన్‌ అని పిలిచే ఈ పూలు ఎక్కడా ఆకు అన్నది కనిపించకుండా పూసి మొక్క మొత్తం తెల్లగా కనిపిస్తుంది.
మల్లికను సంస్కృతంలో మల్ల లేదా మల్లి అంటారు. వసంత రుతువు ముగిసి గ్రీష్మ ఋతువు ఆరంభమవుతున్న సంధి సమయంలో పూస్తాయి కనుక ‘ వార్షికి ’ అంటారని, గ్రీష్మంలో విర్రవీగిన మల్లెలు శీతాకాలాన్ని చూస్తే భీరువులైపోతాయి కనుక ‘ శీతభీరువు ’ అంటారనీ అమర కోశం చెబుతోంది.
అసలు సుగంధ పుష్పాన్ని పసిపాప నవ్వుని ఇష్టపడనివారు ఉండరుకదా.మల్లెపువ్వుని సంస్కృతంలో ' కుంద పుష్పం ' అంటారు.సంస్కృతంలో  ' కుందమాల ' అనే నాటకం ఉంది.దీన్ని కాళిదాసు సమకాలికుడు అయిన 'దిజ్నౌగుడు' అనే కవి రామాయణం ఆధారంగా రాసాడు.అలాగే శ్రీకృష్ణదేవరాయలు రచించిన 'అముక్తమాల్యద 'లోకూడా గోదాదేవికథ పువ్వులతోనే నడుస్తుంది. శ్రీనాధకవి ' హరివిలాసము' కూడా పువ్వులతోనె నడుస్తుంది.భట్టుమూర్తి 'వసుచరిత్ర 'చరికొండ ధర్మన్న రాసిన ' చిత్రభారతం ' లోనూ, నందీతిమ్మన రాసిన 'పారిజాతాపహరణం ' లోనూ ,భీముడు సౌగంధికా పుష్పాల కొరకు వెళ్ళడం...వంటి ఎన్నో కథలు చదివాము,విన్నాము.
వైద్యంలో.......
అలసిపోయిన కనులపై మల్లెలను కొద్దిసేపు ఉంచినట్లయితే చలవనిస్తాయి.
తలలో చుండ్రు సమస్య అధికంగా ఉంటే మెంతులతోపాటు కాసిన్ని ఎండుమల్లె పూలు కలిపి నూరి తయారైన చూర్ణాన్ని తలకు పట్టిస్తే చుండ్ర సమస్య తగ్గడమే కాక జుట్టు కూడా పట్టు కుచ్చులా మెరిసిపోతుంది.
కొబ్బరి నూనెలో మల్లెపూలు వేసి ఓ రాత్రంతా బాగా నానబెట్టి ఆ తర్వాత బాగా మరగబెట్టి తలకు పట్టిస్తే కేశాలు ఆరోగ్యవంతమవడమే కాక మాడుకు చల్లదనాన్నిస్తుంది.
మల్లె పువ్వులను ఫేస్ ప్యాక్‌గా కూడా వాడుకోవచ్చు. మల్లెల్ని పేస్టుగా చేసి కొద్దిగా పాలు కలిపి, నెమ్మదిగా మసాజ్ చేసుకోవాలి. ఆ తర్వాత ముల్తానామట్టి, గంధం, తేనె అరస్పూన్ చొప్పున కలిపి ప్యాక్ వేసుకోవాలి.
మల్లెపూల రసం తీసి గులాబీ పువ్వుల రసం, గుడ్డులోని పచ్చ సొన రెండేసి స్పూన్ల చొప్పున కలిపి ముఖానికి రాస్తే ముఖం మృదువుగా కాంతివంతంగా మెరిసిపోతుంది. మల్లెపూలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అందువల్ల పలు ఔషధాలలో మల్లెపూలను వాడతారు. 
ఆరోగ్యంలో.....
ఇంకా పువ్వులు కాయలై పండ్లు అవుతున్నాయి.పరోక్షంగా భూలోక అమృతమైన తేనే సేకరణకు ఎంతో తోడ్పడుతున్నాయి. పువ్వులు కంటికి అలౌకిక ఆనందాన్ని,నాసికానికి సుగంధాన్ని,కూరకు కాయగా, విందుకు పండ్లుగా,ఆరోగ్యానికి మందుగా,కావ్యాలకు, పాటలకు వస్తువుగా, ఈసృష్టినే పలు వర్ణలతో శోభింపచేసే పూల అందాలకు మురిసిన మనందరం వాటి సుగంధలకు దాసులమే .
సినిమాల్లొ ఎన్నో మల్లెల గీతాలు మనలను ఆనందపరిచాయి. 
కామెంట్‌లు