పలక పలక నల్లని పలక
నాన్న తెచ్చిన చక్కని పలక
అక్షరాలను వ్రాసేందుకు
అనువైన సాధనము పలక
ఎదపై తెల్లని అక్షరాలతో
మిలమిల మెరిసే తారక పలక
బలపముకు తోడుగా ఉండే
స్నేహానికి సాక్ష్యం పలక
ఎన్నో ఎన్నో రకాలుగా
పలక,బలపం రూపాలు
విద్యార్థుల జీవితాల్లో
వెలుగులు నింపే దీపాలు
ఇంటిలో, సంచిలో ఉండే
బడిలో బయటకు వచ్చే పలక
చిన్నారుల చేతుల్లోన
నాట్యమాడే నెమలి పలక
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి