సంచి మేలులు కోకొల్లలు;- -గద్వాల సోమన్న,9966414580
సంచి మిగుల ఉపయోగము
బడి పిల్లలకూ నేస్తము
పుస్తకాలు దాచుటకు
అనుకూలమైన స్థావరము

కూరగాయలు తెచ్చుటకు
అంగడి సరుకులు మోయుటకు
సంచులు వినియోగముంది
బియ్యం నిల్వ చేయుటకు

డబ్బులు దాచి పెట్టుటకు
గింజలు మూట కట్టుటకు
సంచుల చాలా అవసరము
నిత్యావసర వస్తువులకు

ప్లాస్టిక్ సంచులు వద్దు
కాగితపు సంచులు ముద్దు
పర్యావరణ పరిరక్షణ
అశ్రద్ధ ఇక చేయొద్దు

కామెంట్‌లు