కప్యాసనం! (ప్రవచనం విని)-అచ్యుతుని రాజ్యశ్రీ
 రామానుజాచార్యులవారి గురువు దేవుని నేత్రాలను కప్యాసనంతో పోల్చి చెప్పారు.ఆయన ఇలా చెప్పారు "భగవంతుని కళ్ళు కోతి ఆసనం పృష్ఠం పిరుదులు లాగా ఎర్రగా ఉన్నాయి."ఆపోలిక రామానుజాచార్యులవారికి రుచించలేదు.కానీ గురువుని విమర్శించరాదు.ఎంతో వినయంగా అడిగారు"గురువు గారూ!నాకు ఇంకో అర్థం స్ఫురిస్తోంది. చెప్పమంటారా?"
సహృదయంతో ఆయన అంగీకరించారు.రామానుజులవారు ఇలా విశ్లేషించారు "క..అంటే నీరు. ప్యాస=పైకి పొడుచుకు వచ్చిన
ప=పానం చేసేది.
పద్మం తూడు కాడ పైన ఉంది.తామరకాడని ఆసనంగా కల్గింది పద్మం.కపి అంటే సూర్యుడు అని కూడా అర్థం ఉంది.
చెరువు లో నీరు బాగా ఉంటే తామరపువ్వు కాడబలంగా పైకి వస్తుంది.నీటిపైభాగాన పువ్వు సూర్య కిరణాలకి చక్కగా వికసిస్తుంది.
అలాగే పరమాత్ముని నేత్రాలు తామరరేకుల్లాగా విశాలంగా ఉన్నాయి అని అర్థం.పద్మపత్రవిశాలాక్షుడు భగవంతుడు.ఎంత మంచి భావం అర్థం!!? 🌷

కామెంట్‌లు