ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో మనుషులు కాలం కంటే వేగంగా ప్రయాణం సాగిస్తున్నారు. ఇల్లు, పిల్లలు, ఉద్యోగం, ఆఫీసు, ఆసుపత్రులు ఇలా ఒకటేమిటి వివిధ రకాల బాధ్యతలతో ఒత్తిడి పెరుగుతోంది. ఫలితంగా ఈ ప్రభావం చేసే పనిపై ఎక్కువగా పడుతూ. మానసిక ఆందోళనకు కారణమవుతోంది. సమస్యలు నిత్యం విలయ తాండవం చెస్తున్న ఈ రోజుల్లో మానసిక ప్రశాంతత అనేది మనస్సు మరియు శరీరానికి ఒక వరం. పునరావృత దుఃఖాన్ని విడిచిపెట్టే శాంతియుత ఉల్లాసవంతమైన మనస్సును సాధించుకోవదమే ఈ కష్టాల కల్లోల్లాన్ని తట్టుకునేందుకు ఒక దివ్యమైన మార్గమని ఆధ్యాత్మికవేత్తలు పేర్కొంటున్నారు.శాంతిపై విజయం సాధించిన వ్యక్తిని మొత్తం కోణంలో ఒక దిశలో అధిగమించవచ్చు. ప్రశాంతమైన మనస్సు మనస్సులోని చెత్తను తొలగించగలదు. కల్మషాలతో కూడుకున్న మనస్సే అన్ని కష్టాలకు మూలకారణంగా చెప్పబడుతోంది. ప్రశాంతంగా వున్న మనస్సు మానసిక ధృఢత్వాన్ని సూచిస్తుంది. మానసికంగా దృఢంగా ఉన్న వ్యక్తులు తృప్తి పొందేందుకు ఎంత కష్టపడి పని చేయడానికైనా సిద్ధపడతారు. వారు తక్షణ సంతృప్తికి లేదా తాత్కాలిక అనుబంధానికి లొంగిపోవడానికి నిరాకరిస్తారు. దీర్ఘకాలిక లక్ష్యాలను ఏర్పరచుకోవడం ద్వారా ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవడానికి వారు మార్గాలను అన్వేషిస్తారు. వారికి అన్నింటా విజయమే లభిస్తుంది. మానసిక ప్రశాంతత అనేది బజారులో దొరికే వస్తువు కాదు అది కొనుక్కుంటేనో, అడిగితేనో వచ్చేది కాదు. అది మన మనసులోనే ఉంటుంది.మన ఆలోచనా విధానంలో ఉంటుంది.మనకు ప్రశాంతత లేదు అంటే, మనం మనకి నచ్చేలా లేమని అర్ధం, లేనిది ఎదో మనసు కోరుకుంటుందని అర్ధం. అందుకే మన ఆలోచనా విధానాన్ని ముందు అత్యుత్తమంగా మార్చుకుంటే ఏ సమస్య ఉండదు. మానసిక ప్రశాంతత మనలోనే దాగి వుందని,సాధన ద్వారానే దానిని పైకి తీయగలమన్న సంగతిని ముందు మనం అవగతం చేసుకోవాలి.
మానసిక ప్రశాంతత; - సి.హెచ్.ప్రతాప్

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి