సృష్టిలోని జీవుల్లో సమస్యలతో సత మతం అయ్యేది మానవులొక్కరే,
సమస్యలు లేని ఇల్లంటూ ఉండదు
ఆర్థిక, ఆరోగ్య ఇంకా ఇతర విషయాలతో సమస్యల వలయoతో నిండివుంటుంది
కరువుకాటకాలు, తుఫాను, భూకంపాల సమస్యలవల్ల ఒక ప్రాంతమో, ఒక నగరమో
ప్రభావితం అవుతుంది
చాలా వరకు సమస్యలకు కారణం స్వయం కృతాప రాదాలే,
కొoదరైతే తాము సమస్యలు సృష్టించుకోవడమే కాకుండా , ఇతరులను కూడా ఆ వలయం లోకి లాగడం విచిత్రం!
కుటంబంలో రగిలిన కలతలు ప్రేమసంబంధాలను విచ్చిన్నం చేస్తాయి
మానవుల కష్టాలకు ముఖ్య కారణం ఇతరుల జీవితాలతో తమ జీవితాలను పోల్చుకోవడం,
ఎవరి జీవితం వారిదే ,
వారికున్న సుఖం ఎదుటివారికుండదు కదా!
అనుకుని ఉన్నదానితో తృప్తిగా జీవిస్తే
కష్టాలపాలు కారుకదా!
ఈర్ష్య, అసూయ, ద్వేషాలు దూరశ వీటన్నికి కారణం ఇతరుల జీవితాలతో తమ జీవితాలను పోల్చుకోవడం వల్లనే కదా!
వీటితో క్రుంగి క్రుంగి , సంపాదనకై పరుగెత్తి, పరుగెత్తి అలిసిపోయి చివరికి
వెనక్కితిరిగి చూసుకుంటే ,
ఆత్మీయులందరిని వదులుకుని, చివరి దశలో ఒంటరితనమే మిగలుతుంది.
ఉన్నదాంట్లో సంతోషంగా జీవించడం ఆరోగ్యకరం,
ఆ సంతోషం కుటుంబ సభ్యుల తో గడపడమే అని గ్రహిస్తే మంచిది
ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు కదా!
దేహమనే చెట్టుపై హృదయమనే గూటిలో
జీవుడనే పక్షి ప్రవేశించి కిల కిలా రావాలు చేస్తూ ప్రశాంతంగా ఉంటుంది
తృష్ణ అనే వల కింద ఇంద్రియ విషయాలనే దాన్యపు గింజలు జల్లి మాయ అనే వేటగాడు చాటుగా చూస్తాడు
ఈజీవుడు అమాయకంగా ఆ వల పై వాలు తున్నాడు
మాయ అనే వేటగాడు మెడ వంచి ఆజీవుల్లో అనేక మందిని దుఃఖం అనే బుట్టలో కుక్కి
ఉoచుతున్నాడు
నిత్యం అసూయ ద్వేషాలతో , పగ ప్రతీ కారంతో రగిలే మానవులకు చివరకు మిగిలేది దుఃఖమే!
ప్రేమగా పాలకరిస్తూ ఆధరాభిమానాలతో
నిండిన హృదయం కలవారు ఎప్పటికి ఆరోగ్యం తో నిండిన సంపన్నులే!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి