విజయాలను ప్రసాదించే విజయ దశమి శుభాకాంక్షలు💐🎉💐
==============================================
న్యాయాలు -296
శ్వలీఢ పాయస న్యాయము
******
శ్వ అంటే శునకము లేదా కుక్క. లీఢము అంటే తినబడినది, నాకబడినది.పాయసము అంటే క్షీరాన్నము లేదా పరమాన్నము.
శ్వలీఢ పాయసము అంటే కుక్క ముట్టిన లేదా తినబడిన పాయసము.
పూజలు వ్రతాలు చేసేటప్పుడు ఎంతో నియమ నిష్ఠలతో నైవేద్యాలు, ప్రసాదాలు తయారు చేస్తారు.అలా చేసిన వారు ఇతరులను కూడా పూజ పూర్తి అయ్యేవరకు ముట్టనివ్వరు.అలా ఎంతో భక్తితో మనసంతా తాము చేస్తున్న క్రతువుపై దృష్టి కేంద్రీకరించి ఆచారాల, సంప్రదాయాల విషయంలో తు.చ. తప్పకుండా పాటిస్తూ ఉంటారు. మరి అలాంటి సమయంలో పొరపాటున ఇతరులు తాకినా అనుకోకుండా ముట్టినా తాము చేసే వ్రతం భంగమైనట్లు,అపవిత్రమైనట్లు బాధ పడుతూ ఉంటారు.
మరి అలాంటిది ఏకంగా కుక్క ముడితే, చేసిన వాటిలో మూతి పెడితే అది మామూలుగా మనం తినడానికే పనికి రాదు.ఇక దైవ పూజకు పనికొస్తుందా? అస్సలు రాదు కదా!...
ఇది అందరికీ తెలిసిందే కదా. ఇందులో కొత్తగా ఏముంది అని అనిపించవచ్చు కానీ మన పెద్దవాళ్ళు మామూలు వాళ్ళు కాదు ప్రకృతిలోని ప్రతిదీ గమనించడమే కాకుండా మనిషి మనసును కూడా నిశితంగా పరిశీలించి దానిలో ఏమేం లొసుగులు ఉన్నాయో , అసలు మనసంటే ఎలా ఉండాలో, మనిషి మనస్తత్వం ఎలా వుండకూడదో లోతుగా అధ్యయనం చేసి చెప్పారు. అలా చెప్పిందే ఈ "శ్వలీఢ పాయస న్యాయము".
ఎంతో గట్టి నమ్మకం, ప్రయత్నంతో చేయాల్సిన పని ప్రారంభించినప్పటికీ చేసే వ్యక్తి మనసు స్వచ్ఛంగా లేనట్లయితే ఆ పనిని పరమేశ్వరుడు కూడా మెచ్చడు అనే అర్థంతో ఈ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
మనిషి సంఘజీవి. తాను ఉన్న సమాజానికి, సంఘానికి చేతనైనంత సేవ, లేదా మేలు చేయాలి. కానీ తన స్వార్థం కోసం సమాజానికి కీడు తలపెట్ట కూడదు. అలా తలపెట్టిన కార్యాన్ని ఇతరులే కాదు భగవంతుడు కూడా మెచ్చడు. ఆ తలపెట్టిన కార్యం కుక్క ముట్టిన పాయసం లాంటిది. అది తాను తిన్నా ఇతరులు తిన్నా హానే జరుగుతుంది కదా!అందుకే వేమన ఇలా అంటాడు.
"ఆత్మశుద్ధి లేని యాచార మదియేల/భాండ శుద్ధి లేని పాకమేల?)చిత్తశుద్ధి లేని శివపూజ లేలరా?/ విశ్వధాభిరామ వినురవేమ"!
మనసు నిర్మలంగా స్వచ్ఛంగా లేకుండా దుర్బుద్ధితో చేసే ఆచారం ఎందుకు? వంట పాత్ర శుభ్రంగా లేని వంట ఎందుకు? అది ఒంటికి విష తుల్యమే అవుతుంది కదా! అలాగే దురాలోచనతో చేసే శివ పూజ ఎందుకు? ఇతరులకు కీడు కలగాలని పూజిస్తే ఏ దేవుడు మాత్రం ఎందుకు మెచ్చుతాడు అని అర్థం.మరలాంటి పూజ లేదా వ్రతం కుక్క ముట్టిన పాయసం లాంటిదే కదా!.
కాబట్టి అలాంటివి అసలు చేయకూడదు.ఈ న్యాయములోని నిగూఢమైన అంతరార్థాన్ని గ్రహించి బతికినంత కాలం ప్రాణ వాయువు ఇచ్చే తరువు లాగానో, పంటలను పండేందుకు ఉపయోగ పడే చెరువులాగానో జీవిద్దాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి