దుర్గతిని నివారించు అమ్మ
దుర్గముని సంహరించిన కొమ్మ
నిత్యానందమిచ్చునీ అమ్మ
సర్వాభీష్ట ప్రదాయిని అమ్మ
కాలాతీత కనకదుర్గ ఉమా!
గ్రహదోషమును బాపుతుంది
భయo,ఉన్మాదము త్రోలుతుంది
వివాహాటంకాల తీరుస్తుంది
ఆవేదనముక్తిని అందిస్తుంది
ఇంద్రకీలాద్రి నివాసిని ఉమా!
శివాభవాని, దుర్గేశ నందిని
దురితవిమోచనా కారిణి
దుర్గమాంగి దుర్లభా యోగినీ
దుర్గమాశ్రీతా ఆర్తి శమనీ
జీవాత్మ పరిశోధినీ ఉమా!
మాతంగీ మధుర కటాక్షము
మానవ జీవిత దివ్య వికాసము
అనంతము అమ్మణ్ణి రూపము
కమలాలయగౌరి కారుణ్యము
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి