ఊహలపల్లకి- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
నా మనసు
మేఘాలపల్లకినెక్కి
ఆకాశంలో
విహరించాలంటుంది

నా మది
అందాలనుచూఛి
ఆనందడోలికలో
ఊరేగాలంటుంది

నా మతి
ఆలోచనలుపారించి
ఊహలమీనాలో
ఊయలూగాలంటుంది

నా హృదయం
అందలమధిరోహించి
ప్రణయలోకంలో
పయనించాలంటుంది

నా తనువు
పల్యంకనమెక్కి
పూలతోటలో
పచార్లుచేయాలంటుంది

నా గుండె
కరిగిపోయి
కడలితరంగాలతో
ఎగిరిపడదామంటుంది

నా బుద్ధి
నిశితంగాగమనించి
నైపుణ్యమును
నిరూపించాలంటుంది

నా చిత్తం
చలించి
వివిధాలోచనలతో
తేలిపోదామంటుంది

నా ఆలోచనలు
హరివిల్లునెక్కి
గగనసీమలో
గంతులేయాలంటున్నవి

నా అహం
పరవశించి
పేరుప్రఖ్యాతులకై
పాటుపడదామంటుంది

నా కలం
కమ్మనికైతలను
కాగితాలపై
చెక్కాలంటుంది

ఊహలు
ఆగటంలా
కవితలు
వీడటంలా


కామెంట్‌లు