మనోభిరామం;- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 నామనసే నీపాదాలకు 
ఒక పూజాకుసుమం
నాభావన అలా అలా సాగే సుమసౌరభం
అభంశుభం తెలియని నామనసే 
ఒక మందిరం
అందులోన వరాలిచ్చు దేవతవే నీవని
అర్పించెమనోభిరామంద నీపదముల నవవికసిత కుసుమమ్ముల
మరి.....!
నీ చేలాంచలమే నాదు జీవనౌక చుక్కానిగ
నీ కరకంకణ నిక్వాణమే నాకు కర్ణపేయ నినదంగా
నీకన్నుల జాలువారు ప్రేమధార నాదు కలుషహారిగా
నీ చిరునగవుల చిరుకాంతి నాదు మార్గ తిమిరహారిగా
నీ మానస ఉపవనమే నాదు నందనోద్యానముగా
ఊహించెద నాజీవన సహచరిని
స్వర్గధామ సంధాతగ
పూజించెద కోటి సుమహారమ్ముల
నా మనోభిరామమ్మున!!
*********************************

కామెంట్‌లు