మన పాటల పల్లకిలో .- సేకరణ : డా. బెల్లంకొండ నాగేశ్వరరావు

 155౦వ సంవత్సరంలో శ్రీ రామామాత్యుల వారు మేళకర్తలను మొట్ట మొదటిగా “స్వర మేళ కళా నిధి” అనే పవిత్ర సంగీత శాస్త్ర గ్రంధంలో పొందుపరిచారు ఆతరువాత శ్రీయుతులు వే౦కటమఖి మరియు గోవిందాచారి మేళ కర్తరాగాలకు రూపు రేఖలను ఏర్పరచి సంపూర్ణ రాగాలుగా వాటిని స్థిరీకరించారు.ఈ ముగ్గురిని “స్వర త్రయం” గా మనం గుర్తుంచుకొని గౌరవించుకోవటం మన ధర్మం .
ఈనాడు స్వరవీణాపాణి ఆ మహా సరస్వతి దివ్యానుగ్రహంతో సూక్ష్మీకరించిన 72 మేళకర్తరాగాల స్వర కల్పనను సాహిత్యంతో సహా అందించారు. ఇది ఒక అపూర్వ రాగయాగం, అమోఘమైన నూతన ఆవిష్కరణం....21 వ శతాబ్ధిలోనే సంగీత రంగంలో మహా విప్లవం. సంగీత ప్రియులందరికీ, ,సంగీత విద్యార్ధినీవిద్యార్ధులందరికీ సంతోషకరం. ఈ సంగీత యజ్ఞం పేరు స్వరనిధి’ కావడం యాదృచ్ఛికం.. దైవ సంకల్పం.
భారతీయ సంగీత ప్రాభవ వైభవాలకు మహా దర్పణం ఈ “స్వరనిధి” ప్రయోగం. “ స్వరనిధి” - ప్రపంచ సంగీతానికి పెద్ద బాలశిక్ష .ప్రపంచంలోని అన్ని సంగీతాల సూక్ష్మ రూపం ..72 మేళకర్త రాగాల ఈ కల్పనం. రాప్, పాప్, రాక్, జాజ్, డిస్కో, గజల్, భజన్, ఏ రూపమైనా అన్నింటికి భూమిక ఇది. అన్ని జన్య రాగాలకు ఆధారము ఈ 72 మేళకర్త రాగాలే.. ఇవే జనక రాగాలు.
నేడు మోహన రాగం.లోని పాటల గురించి తెలుసుకుందాం!
ఉన్నవి ఐదు స్వరాలే కాని ...వింటుంటే పంచ ప్రాణాలకు హాయినీ ఇస్తుంది ఈ మోహన రాగం. ప్రపంచం లోని అన్ని సంగీత పధ్ధతుల్లో ఈ రాగం ఉంది.
పాట : పాడవేల రాధికా .చిత్రం : ఇద్దరు మిత్రులు . రచన : శ్రీ శ్రీ .
సంగీతం : సాలూరి వారు. గానం : సుశీల, ఘంటసాల గార్లు .
శ్రీ శ్రీ గారి కలానికి నాలుగు వైపులా పదునులా ఉంది. విప్లవ గేయాలు ,
ప్రణయ గీతాలు,భక్తి పాటలు,విషాద గీతాలు ...అన్నింటిలోనూ ఆరి తేరిన చేయి వారిది. 
మేడ మీద ఆరుబయట,చల్లని వసంత రాత్రి, స్నేహితురాళ్ళు - ఒకరు వీణతో, మరొకరు మోహన రాగంతో గానం ఆలపిస్తుంటే ,స్వర్గం నుండి పిలుపు వచ్చినా...వద్దనాలనిపిస్తుంది.వసంత రాత్రులలో......వెన్నెల వెలుగులలో ...జాజి / మల్లె పందిరి కింద పడుకుని పైన ఉన్న చందమామ వెన్నెల అందాలను ఆస్వాదించే అదృష్టం ..... నేడు కాంక్రిట్ జంగల్ లలో ,అపార్ట్ మెంట్లలో ఉండేవారికి ఆ అనుభూతి కరువే కదా !
కర్నాటక సంగీతంలో మోహన రాగంలో వచ్చిన కొన్ని ప్రసిద్ధ రచనలు:
1. నిన్ను కోరి (వర్ణం)
2. ననూ పాలింప (త్యాగరాజ కృతి)
3. ఎవరూరా నిను వినా (త్యాగరాజ కృతి)
3. బాల గోపాల ( నారాయణ తీర్ధులవారి తరంగం)
4. రక్త గణపతిం భజేహం (ముత్తుస్వామి దీక్షితార్ కృతి)
5. చందన చర్చిత (గీతాగోవిందం-జయదేవ)
6. రతి సుఖసారే (గీతాగోవిందం-జయదేవ)
7. రామా నిను నమ్మిన వారము (త్యాగరాజ కృతి)
8. మాటిమాటికి తెల్పవలెనా (త్యాగరాజ కృతి)
9. భవనుత (త్యాగరాజ కృతి)
10. మోహన రామ (త్యాగరాజ కృతి)
11. చేరి యశోదకు శిశువితడు (అన్నమాచార్య కృతి)
  పైన చెప్పినవి కొన్ని ప్రసిద్ద కీర్తనలు మాత్రమే.
సినిమా సంగీతంలో మోహన రాగం:
 సినిమా సంగీతంలో మోహన రాగాన్ని వాడినంతగా వేరే ఏ రాగాన్ని వాడలేదనుకుంటా. కారణం ఏమిటంటే పైన చెప్పిన విధంగా ఈ రాగంలో నవరసాలు పలికించవచ్చు. ఉదాహరణకి....
 ఎస్. (సుస్వర) రాజేశ్వరరావు గారు ఈ రాగాధారంగా అనేక పాటలకు సంగీతం అందించారు. ' వినిపించని రాగాలే ' (చదువుకున్న అమ్మాయిలు - సుశీల), ' చూడుమదే చెలియా ' (విప్రనారాయణ - ఏ.ఎం.రాజ), మధుర మధురమీ చల్లని రేయీ (విప్రనారాయణ - ఏ.ఎం.రాజ, పి.భానుమతి),  కొన్ని అద్భుతమైన మోహన రాగంపై ఆధారితమైన సినిమా పాటలు.
 కనులకు వెలుగువు నీవే కాదా -- భక్త ప్రహ్లాద
 నిన్ను కోరి వర్ణం -- ఘర్షణ
 మనసు పరిమళించెనె -- శ్రీకృష్ణార్జున యుద్ధం
 తెల్లవార వచ్చె తెలియక నాసామీ -- చిరంజీవులు
తెలుసుకొనవె యువతి -- మిస్సమ్మ
సిరిమల్లె నీవే -- పంతులమ్మ. ఐనదేమో ఐనది -- జగదేకవీరుని కధ
18. మోహన రాగమహా -- మహా మంత్రి తిమ్మరుసు
19. పలికినదీ పిలిచినది -- సీత రాములు
21. పులకించని మది పులకించు -- పెళ్ళికానుక
22. తిరుమల గిరివాసా -- రహస్యం
23. వే వేల గోపెమ్మల మువ్వా గోపాలుడె -- సాగర సంగమం
24. గోపాల జాగేలరా --- భలే అమ్మాయిలు
25. ననుపాలింపగ నడచీ వచ్చితివా -- బుద్ధిమంతుడు
26. రతిసుఖ సారె -- జయదేవ
27. జ్యోతి కలశ చలికే -- (హింది - భాభీకి చుడియా)
28. సయొనారా సయినారా -- (హింది - లవ్ ఇన్ టొక్యో)
29. ఆ మొగల్ రణధిరుల్ -- (ఘంటసాల వారి ప్రైవేటు ఆల్బం)
30. భారతీయుల కళా ప్రాభవమ్మొలికించి -- (ఘంటసాల వారి ప్రైవేటు ఆల్బం).
' మోహన రాగమహ ' మహమంత్రి తిమ్మరుసు . ' చందన చర్చిత ' తెనాలి రామకృష్ణ . ' ఓ ఓ ఒయ్యార మొలికే చిన్నది ' ' నీరాజు పిలిచెను ' మంగమ్మ శపధం . ' నల్లవాడే రేపల్లెవాడే ' చిరంజీవులు . ' పాడెద నీ నామమే గోపాల ' అమాయకురాలు. ' నీవు రావు ' పూలరంగడు. ' లేరు కుశ లవులకు సాటి ' లవకుశ .' నెమలికి ' సప్తపది . ' ఆకాశం లో ' స్వర్ణ కమలం. ' ఎంత హాయి ' ' మౌనగానీ ' గుండమ్మకథ . ' ఎచటినుండి వీచెనో ' అప్పు చేసి పప్పుకూడు . ' మదిలో వీణలు ' ఆత్మీయులు . ' మధుర మధురము ' విప్ర నారాయణ ' . ' తిరుమల మందిర ' మేనకోడలు . ' లాహిరి లాహిరి ' మాయబజార్ . ' ఈ నాటి ఈ హయి ' జయసింహ. ' ఘనా ఘనా సుందరా ' భక్తతుకారాం ' ఇది చల్లని వేళైనా ' పూజాఫలం . ' భారత వీర కుమారిని ' సంఘం .' తీయని ఊహలు ' పాతాళ భైరవి . ' తెలుసు కొనవె ' మిస్సమ్మ .' ఆది భిక్షువును ' సిరివెన్నెల .మెదలగు పాటలు.
.

కామెంట్‌లు