వీడ్కోలు!! - సునీతాప్రతాప్ పాలెం నాగర్ కర్నూల్ జిల్లా
గురుదేవుడు రవీంద్రుడు
పాలెం గుడిలో దేవుడు భాస్కరుడు!!

వ్యక్తి పూజ తగదంటారు కానీ
మనిషి యుక్తి శక్తి పూజను కాదనరు కదా!!

మట్టిలో పుట్టిన చెట్టు ఆకలి తీర్చిన 
అన్నపూర్ణ లాంటి సూర్యుడు అతడు!!!

ఒకే ఒక వాక్యంలో చెప్పాలంటే
మట్టిలో మాణిక్యం మన భాస్కరుడు!!

మృదుభాషి సుగుణశీలి మితభాషి
భాగ్యశీలీ ధైర్యశాలి కార్యశీలీ మా భాస్కర్ రెడ్డి సార్!!

మచ్చలేని చంద్రుడు
సరళరేఖ లాంటివాడు
గంధం లాంటి గుణవంతుడు
మహా గ్రంధం లాంటి విలువలు గలవాడు!!
మా భాస్కర్ సార్!!!

తెల్ల కాగితంపై అతను చేసిన పచ్చని సంతకం
మాకు వసంతం!!
నల్లని నేలపై అతను చేసిన ఆకుపచ్చని సంతకం
సిరుల పంటలు!!

విద్యార్థుల్ని తీర్చిదిద్దిన
ఒక పలక బలపం అతను!!
ఉపాధ్యాయుల్నీ దయతో చూసిన
ఉత్తమ ఉపాధ్యాయుడు అతను!!

గజరాజులా ఊరేగిన రారాజు అతను
ప్రతిరోజు అతనికి ఒక విజయమే
నిజమైన మనిషి మా ఉపాధ్యాయుల మనీషీ అతను!!!

ఎంఈఓ భాస్కర్ రెడ్డి గారికి బదిలీ వీడ్కోలు సందర్భంగా 
04/10/2023

కామెంట్‌లు