శ్రీ రాముడు ; -కొప్పరపు తాయారు
 ఇక్ష్వాక వంశ ప్రభవో రామో నామ జనైః శ్రుతః,!
నియత ఆత్మ మహా వీర్యో ద్యుతిమాన్ దృతిమాన్ వశీ !
బుద్ధి మాన్ నీతి మాన్  వాజ్మీ గ్రీవో మహా హనుః  !
మహారస్కో మహేష్వాసో గూఢ జత్రుః అరిందమః !
ఆజాను బాహుః సుశిరాః  సులలాటః  సువిక్రమః  !
ఇచ్వాకు వంశం మిక్కిలి వాసిగాంచి నది. లోకోత్తర పురుషుడైన శ్రీ రాముడు అవతరించి ఎంతయు జగత్ ప్రసిద్ధుడాయెను. అతడు మనో  నిగ్రహము కలవాడు. గొప్ప పరాక్రమవంతుడు మహా తేజస్వి ధైర్యశాలి జితేంద్రుడు ప్రతిభా మూర్తి. నీతి శాస్త్ర కుశలుడు చిరునవ్వుతో మితముగా మాట్లాడుటలో నేర్పరి సద్గుణైశ్వర్య సంపన్నుడు. శత్రువులను సంహరించువాడు.  ఎత్తయిన భుజములు కలవాడు బలిష్టమైన బాహువులు కలవాడు.శంఖము వలెనునుపైన కంఠము కలవాడు . ఉన్నతమైన  హనువులు (చెక్కిలి పై భాగములు) గలవాడు. విశాలమైన వక్షస్థలము కలవాడు.  బలమైన ధనస్సు కలవాడు. పుష్టిగా గూడముగా నున్న సంధియెముకలు గలవాడు అంతశ్శత్రువులను అదుపు చేయగలవాడు . ఆ జాను బాహువు. అందమైన గుండ్రని శిరస్సు కలవాడు, అర్ధచంద్రాకారంలో ఎత్తైన నొసలు కలవాడు. గజాదులకు వోలె   గంభీరమైన నడక కలవాడు.

కామెంట్‌లు