జగతిని జాగృతం చేసే
జ్యోతి కలశం ప్రభవిస్తోంది...
హోమగుండం నుండీ వచ్చే
ఆదిశక్తిలా అభయమిస్తోంది
సాగరమధనంలో వచ్చిన
అమృతభాండంలా తోస్తోంది
బంగరు బంతి కాంతులు
మిరుమిట్లు గొలుపుతోంది
నింగి నిండా కాంచనం
కరిగి ఒలికినట్టు పచ్చబారింది
అధర్మాన్ని అణచడానికి
అవతారమేదో ఆవిర్భవిస్తునట్టుంది
దిక్కులు తెలియని చీకటిలో
గొప్పగ వెలుగులు చిమ్మినట్టుంది
సహస్ర రేకుల సువర్ణపుష్పం
కొండలచాటున విరిసినట్టుంది
చందన శీతల పరిమళమేదో
లోకాన్ని చుట్టుముట్టినట్టుంది
దిగులు తీర్చు వరమేదో పట్టుకుని
వెదుక్కుంటూ వస్తున్నట్టున్న
మేలి పొద్దునకు
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి