పెన్ కౌంటర్;- ఎం. వి. ఉమాదేవి
కూతుర్ని,
కనడానికి భయపడే సమాజపరిస్థితి!
ఖచ్చితంగా కనాలనే మానసికస్థితి!

అమ్మ
కూతురుగా పుడుతుందిట!
కూతురు అమ్మలా ఆలోచిస్తుందట!

తిన్నావా,
లేదా అని అడిగేది కొందరే
వారిలో కూతురెప్పుడూ ముందరే!

అప్పగింతలు
నిజానికి కూతురే చెప్తుంది
కన్నవాళ్ళ క్షేమం కోరుతుంది!


కామెంట్‌లు