@ అజ్ఞానం.... !
****
తాడుకు - పాముకు...
తేడాతెలియని అజ్ఞానం...
ఎదురుదెబ్బల అనుభవాలతో
మెల్ల - మెల్లగా జ్ఞానాన్ని పొందుతోంది !
*******
@ మిడి - మిడి జ్ఞానం !
. ***** అజ్ఞానపుతప్పటడుగులనుండి
అడుగులు నేర్చిన జ్ఞానం...,
మిడి - మిడి జ్ఞానపు ...
తడబాట్లతో పడిపోతుంది !
******
* విజ్ఞానం *
****
నిప్పులోదాగిన నీటిని...
నీటిలో నెలవైన నిప్పుని...
మట్టిలోని మహత్తును
కనుగొని... విజ్ఞానం నూతనావిష్కరణలతో...
విరాజిల్లుతోంది... !
*******
* ప్రజ్ఞానం *
****
శిలను శిల్పంగా....
నరకాతుల్యాన్ని స్వర్గసమంగా...
దుఃఖాన్ని - సుఖంగా...
. మోదాన్ని - ఖేదంగా....
విభిన్నంగా - వైవిద్యం గా
మారుస్తోంది ప్రజ్ఞానం... !
*******
* సుజ్ఞానం *
****
మాయను ఛేదించి.....
సత్యాసయాలను గ్రహించి
పూర్తి స్వస్థత తో.....
ప్రశాంతమైన ఆనందంలో
హాయిగా ఉంది సుజ్ఞానం !!
******
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి