సుప్రభాత కవిత ; - బృంద
కన్నులు వెదికే స్వప్నంలా
మిన్నుల వెలిగే దీపం

రాలుపూల దారులలో
రంగులు పరిచే కాంతులు

పండుటాకుల మేనిపై
మేలిమి పసుపు వన్నెలు

ఆకుల అనుభూతులన్నీ
అందమైన జ్ఞాపకాలు

కొత్తచివురుకు వేళయిందని
అనుభవమైన అర్థం

చెట్టుకు చేవగా మారే క్రమం
పట్టుకున్నా ఆగని కాలం

జీవితాల గమనం కూడా
సాగును చిత్రమైన గతులు

బ్రతుకంతా పరుగులు
బాధ్యతల బంధాలు

గట్టుకు చేరిన క్షణం
అంతులేని తృప్తి

అవసాన వేళ అణువంత
అప్యాయత కోసం అర్రులు

అనుబంధాలందరికీ ఉన్నా
దొరికె అదృష్టం  కొందరికే

వెదికిన  దొరికే  ముత్యంలా
పెదవుల మెరిసే నవ్వులు

కదిలే కాలపు గారడీలు
వదలక సాగే నిరీక్షణలు

ఎదురు చూసే రేపులు
పొడిచే పొద్దులు...

కొత్తగ తోచే ఉదయానికి

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు