మాతాతగారి ఊరు.......... !;- కోరాడ నరసింహా రావు.
మా తాత గారి ఊరు మీరు 
   వస్తారా... పిల్లలూ.... !
 అది అందమైన పల్లెటూరు 
    వదలి మీరు రాలేరు !!

బస్సు దిగి  రెండు కిలో 
    మీటర్లు నడవాలి.. !
 దారి పొడుగునా  ఉన్న 
    అందాలను చూడాలి !!

రోడ్డు కిరు వైపులా... 
   నీడనిచ్చు చెట్లున్నవి !
 కనుచూపు మేరలో... 
   పంట పొలాలే  అన్నీ ... !!

ఆ పొలాలను ఆనుకుని 
    ఉన్నది  ఓ పెద్ద చెరువు !
 ఆ చెరువు నీటితోనె... 
  మాపంటలన్ని పండుతాయి !!

మా ఊరికి ఉత్తరాన.... 
  రామా లయ మున్నది.... 
  దక్షిణాన ఉన్నది.... 
   మా  ఊరి బడి... !

ఊరి  మధ్యలోనె... 
  పెద్ద మంచినీళ్ల బావి... 
  ఆ బావినీళ్ళే.... ఊరం 
     దరికీ    ఆధారము... !

పడమటి దిక్కున... 
 పెద్ద మర్రి, రావి చెట్లతో 
  చుట్టూ గచ్చును వేసిన... 
   వి శాలమైన  రచ్చ బండ... !

సాయంకాలము అక్కడె 
  అందరు కలిసెదరు.... 
 ఆ రచ్చబండ మీదే.... 
   ఊరి తగవులు తీర్చెదరు !

తూరుపు దిక్కున పెద్ద 
   ఖాళీ స్థలము.... 
  అచట రేకు షెడ్డుతో... 
   పెద్ద ఎత్తైన వేదిక... !

ఆ వేదికపైనే  మాకు.... 
   సినిమాలు - నాటకాలు 
 వినోద కాల క్షేపాలన్నీ... 
  మా ఊరందరి కక్కడే..... !

స్వచ్ఛమైన గాలి, నీరు 
 ఆరోగ్యం - ఆహ్లాదం... 
   మా గ్రామాలలో నివసించే 
     ప్రజలదే... అదృష్టం... !

మాతాతగారి ఊరికి 
   రండి  పిల్లలూ... 
 మా  ఊరు చూసి వద్దాము 
    పదండి పిల్లలూ.... !!
     *******

కామెంట్‌లు