దేశ సమగ్రత కోసం వల్లభాయ్ పటేల్ జీవితం అంకితం
 దేశరక్షణ కోసం, సమగ్రత కోసం నిత్యమూ పాటుపడిన దేశభక్తుడు వల్లభాయ్ పటేల్ అని వోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయని బలగ నాగమణి అన్నారు. జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ఆమె అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నాగమణి మాట్లాడుతూ చిత్తశుద్ధితో కూడిన సేవలతో పటేల్ తన జీవితాన్ని అంకితం చేసారని అన్నారు. 
ఉపాధ్యాయని దానేటి పుష్పలత మాట్లాడుతూ స్వాతంత్ర్య సమర యోధుడై ఉద్యమ స్ఫూర్తిని పంచి, జైలులో కూడా గడిపి, భారతీయులలో ధైర్యాన్ని, ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించిన ఉక్కుమనిషి పటేల్ అని అన్నారు. 
ఉపాధ్యాయులు గోగుల సూర్యనారాయణ మాట్లాడుతూ బార్డోలీ సత్యాగ్రహానికి నాయకత్వం వహించి, విజయం సాధించి, సర్దార్ అనే బిరుదును పొందిన గొప్ప పరిపాలనా దక్షత పటేల్ సొంతమని అన్నారు. భారతదేశ ఉపప్రధానిగా దేశానికి ఎనలేని సేవలు గైకొన్నారని అన్నారు.
ఉపాధ్యాయులు సిద్ధాబత్తుల వెంకటరమణ మాట్లాడుతూ న్యాయవాదిగా ఉంటూనే మహాత్మాగాంధీ అడుగుజాడల్లో నడిచి, దేశానికి విశేషమైన సేవలందించిన వల్లభాయ్ పటేల్ మనందరికీ ఆదర్శప్రాయులని, రాజ్యాంగ పరిషత్ సభ్యునిగా కూడా పనిచేసి కీలకపాత్ర పోషించారని అన్నారు.
ఉపాధ్యాయులు కుదమ తిరుమలరావు మాట్లాడుతూ సామాజిక చైతన్యం పెంపొందించి, స్వాతంత్ర్య సమరయోధుడయ్యారని, 
తన జీవితంలో చేసిన త్యాగాలను కీర్తిస్తూ భారతరత్న గౌరవాన్ని భారత ప్రభుత్వం ప్రకటించిందని అన్నారు. 
తొలుత ప్రధానోపాధ్యాయని బలగ నాగమణి వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి,
విద్యార్థులందరిచే ఐక్యతా ప్రతిజ్ఞ గావించారు. 
అనంతరం గ్రామంలో జాతీయ ఐక్యతా ర్యాలీ నిర్వహించారు.
కామెంట్‌లు