ఆవు (బాల గేయం);- - పల్లోలి శేఖర్ బాబు కొలిమిగుండ్ల 8008527678.
ఆవమ్మ ఆవు
 తెల్లని ఆవు 
అమ్మ వంటిది ఆవు
బామ్మ లాంటిది ఆవు 

పాలు ఇచ్చే ఆవు 
ఆవు సాధు జంతువు
దేవతలుండు ఆవు
పూజ చేస్తే మేలు

ఆవు ను గౌరవించు 
ఆవు ను పూజించు 
ఇంట్లో ఆవును పెంచు
ఆరోగ్యాన్ని పంచు

గోవు ఎంతో పవిత్రం 
 గోవు మూత్రం ఔషధం
గోవుల సంరక్షణ
మానవ జాతి రక్షణ 

కామెంట్‌లు